డాక్టర్ జవహరీ కాదు.. డాక్టర్ టెర్రరిస్ట్!!
మెడిసిన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఆ తర్వాత సర్జరీలో మాస్టర్స్ పూర్తి. కొంతకాలంపాటు కంటి శస్త్ర చికిత్స నిపుణుడిగా పనిచేశాడు. అంతేకాదు.. అతని ఇంట్లో చాలామంది వైద్యులున్నారు.. స్కాలర్లున్నారు.. తండ్రి ఫార్మకాలజీలో ప్రొఫెసర్. ఇంతటి ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ ఛాందస భావాలు ఎక్కువగా ఉండటంతో డాక్టర్ అల్ జవహరీ కాస్తా డాక్టర్ టెర్రరిస్ట్‌గా మారాడు.
తీవ్రవాద భావజాలం ఎక్కువగా ఉండటంతో వైద్యుడిగా ఆయన కొనసాగలేదు. ఆయుధాలను అక్రమంగా ఉపయోగిస్తున్నందుకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్న సమయంలో పోలీసులు జవహరీని తీవ్రంగా కొట్టారు. ఈ పరిణామాలే అతడు మరింత క్రూరంగా మారడానికి కారణమయ్యాయని జులైలోని తోటి ఖైదీలు చెబుతారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సౌదీ అరేబియా వెళ్లిన అతడికి అక్కడే లాడెన్ పరిచయమయ్యాడు.

2011లో లాడెన్ హతమైన తర్వాత అల్ ఖైదా పగ్గాలందుకున్న జవహరీకి అనేక మారుపేర్లున్నాయి. అబు మహ్మద్, అబు ఫాతిమా, మహ్మద్ ఇబ్రహీం, అబు అబ్దుల్లా, ది డాక్టర్, ది టీచర్, ఉస్తాజ్.. అంటూ రకరకాల పేర్లతో చెలామణి అయ్యాడు. 2001 సెప్టెంబరు 11న అమెరికాపై ఆత్మాహుతి దాడి.. 2005లో లండన్‌లో ఉగ్రదాడి.. ఇలా అనేక ఉగ్రదాడుల్లో జవహరీ ప్రమేయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఉగ్రవాదానికి నిధులు సేకరించడం, ఆత్మాహుతి దళాలను తయారు చేయడం, దాడులకు పాల్పడటానికి సమర్థవంతమైన ప్రణాళికలను అమలు చేయడంలో అల్ జవహరీ దిట్ట. కంటి డాక్టర్‌గా ప్రజలకు వెలుగులు నింపాల్సింది పోయి తీవ్ర ఛాందస భావాలతో ఉగ్రవాదంవైపు పయనించి చివరికి అమెరికా చేతిలో హతమయ్యాడు.












Click it and Unblock the Notifications