గొడుగు మూయలేకపోయిన డొనాల్డ్ ట్రంప్, నెటిజన్ల సెటైర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఓ గొడుగును మూయలేకపోయాడట. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. సోమవారం ఇల్లినాయిస్‍లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విమానంలో బయలుదేరారు.
గాలి ఎక్కువగా వీస్తుండటంతో ఆయన తన గొడుగు తీసుకొని విమానం ఎక్కారు. విమానం లోనికి వెళ్తున్న సమయంలో ట్రంప్ గొడుగు మూసేందుకు ప్రయత్నించారు. కానీ దానిని మూయలేకపోయారు.

దాంతో గొడుగును మూయకుండానే లోపలకు వెళ్లిపోయారు. గాలికి ఆ గొడుగు ఊగుతూ విమానం ద్వారం వద్దే ఉండింది. ఆ సమయంలో మీడియా ఫోటోలు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ట్రంప్‌కు గొడుగు ఎలా మూయాలో కూడా తెలియదని, చేతిలో ఉన్న గొడుగునే మూయలేకపోయారు, బాత్రూంకు వెళ్తే ఫ్లష్ కూడా చేయరేమోనని, ట్రంప్ తెల్లగా ఉంటారని, అందుకే నల్లటి గొడుగును పట్టించుకోలేదని, పనివాళ్లు వచ్చి మూస్తారని భావించాడేమోననే సెటైర్లు వేస్తున్నారు.
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
ట్రంప్ దెబ్బకు తలవంచిన ఇరాన్..? ఎట్టకేలకు కాళ్లబేరానికి..? -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications