వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైనోసారేనా?: వింత జీవి సంచారంతో భయాందోళనలు

స్కాట్లాండ్‌లో కూడా ఓ వింత జంతువు కలకలం సృష్టిస్తోంది. ఎప్పుడూ చూడని ఓ జంతువు సంచరిస్తుండటంతో గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

స్కాట్లాండ్: ఇటీవల మన దేశంలోని ఒడిశాలో వింత జీవి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో గొర్రెలను చంపివేయడంతో అక్కడి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏదో వింత జంతువు తమ గొర్రెలను చంపేస్తుందంటూ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, ఆ కెమెరాల్లో ఓ హైనా మాత్రం చిక్కింది.

ఇప్పుడు స్కాట్లాండ్‌లో కూడా ఓ వింత జంతువు కలకలం సృష్టిస్తోంది. ఎప్పుడూ చూడని ఓ జంతువు సంచరిస్తుండటంతో ఆ దేశంలోని సదరు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్కాటిష్ ఫీల్డ్‌లలో ఈ జంతువు కనిపించడంతో జిమ్మీ రైట్(66) అనే వ్యక్తి దాన్ని కెమెరాలో బంధించాడు.

Does the Loch Ness monster have competition? Mystery beast spotted in Scottish field sparks debate

అనంతరం ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అయితే, అది ఏ జంతువంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు అది తాబేలు జాతికి చెందిందని అంటుండగా, మరికొందరు అది మాంసాహార జంతువేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో డైనోసార్‌లా ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

స్కాట్లాండ్‌లోని పశ్చిమ స్టిర్లింగ్‌షైర్‌లోని కెల్లెర్న్ గ్రామంలో ఈ వింత జంతువు సంచరిస్తోందని జిమ్మీరైట్ తెలిపారు. తన కొడుకు పెంచుకుంటున్న కుక్కను బయటకు తీసుకెళ్లిన సమయంలో ఈ వింత జంతువు కౌ ఫీల్డ్‌లో సంచరిస్తోందని చెప్పారు. అది డైనోసార్‌ని పోలివుండటంతో తనకు భయమేసిందని చెప్పుకొచ్చారు. వెంటనే అక్కడ్నుంచి కదిలి ఇంటికి తిరిగొచ్చానని తెలిపారు.

English summary
A mystery beast spotted in a Scottish field could give the Loch Ness monster a run for its money. People have been going wild on social media, coming up with different theories as to what the 'animal' is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X