Monkeypox:మనిషి నుంచి కుక్కకు సోకిన వ్యాధి.. వెలుగులోకి ఫస్ట్ కేసు..బీ కేర్‌ఫుల్..!!

మంకీపాక్స్ కలవరపెడుతోంది. కేసులు కూడా పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ సంపర్కం ద్వారానే వ్యాపిస్తోందని.. నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే మనుషుల నుంచి పెంపుడు జంతువులకు సోకుతుందని తెలిసింది. ఓ ఫ్రెంచ్ జంటతో ఓ శునకం పడుకునేదట. వారిద్దరూ స్వలింగ సంపర్కులు.. బయట కూడా సంబంధాలు కొనసాగించేవారు. వారికి మంకీపాక్స్ సోకింది. వారిద్దరితో కలిసి బెడ్ మీద పడుకున్న ఆ డాగ్‌కు కూడా వైరస్ సోకింది. పెంపుడు జంతువులకు వైరస్ సోకడం ఇదే తొలిసారి.. సో అంతా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.

గే కపుల్.. శునకానికి మంకీ పాక్స్

గే కపుల్.. శునకానికి మంకీ పాక్స్

గే కపుల్.. 44, 27 ఏళ్ల వ్యక్తులు కలిసి ఉంటున్నారు. వారిద్దరూ బయట కూడా తమ సంబంధాలను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇటీవల పొట్టపై చిన్న దద్దురును గుర్తించారు. తర్వాత పరీక్ష చేయగా.. వైరస్ సోకిందని తేలింది. ఆ కుక్క వారిద్దరితో కలిసి పడుకుంది. అందుకే దానికి మంకీపాక్స్ వచ్చిందని లాన్సెట్ జనరల్ పేర్కొంది.

జూన్‌‌లో అనారోగ్యం..

జూన్‌‌లో అనారోగ్యం..


వారిద్దరికీ అనారోగ్య సమస్య జూన్ నెలలో బయటపడింది. అప్పుడు వారు పూత, దద్దుర్లు కనిపించాయి. వారికి వైరస్ వ్యాపించిన.. 12 రోజుల తర్వాత శునకం అనారోగ్యం బారిన పడింది. దానికి మెల్లిగా లక్షణాలు కనిపించాయి. అయితే వైరస్ సోకిన వారు తమ పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉండాలి.. క్వారంటైన్ ముగిసేవరకు దగ్గరకు రావొద్దని వైద్యులు కోరుతున్నారు.

కేసులు పెరుగుదల

కేసులు పెరుగుదల


మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా విధించింది. ఈ క్రమంలోనే మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకిందనే విషయం బయటపడింది.

Recommended Video

    Monkeypox Virus ప్రమాదకరమా? లక్షణాలు ఇవే | Monkeypox పూర్తి వివరాలు | Telugu Oneindia
     సంపర్కం, గాయం వల్ల

    సంపర్కం, గాయం వల్ల


    ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా సోకే అవకాశం ఉంది. గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా వ్యాపిస్తుందట. మనుషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకరు మంకీపాక్స్‌కు గురైన సమయంలో వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుందట. అలాగే మంకీ పాక్స్ వచ్చిన వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, చలి, అలసట ఉంటుంది. ఇప్పుడు మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుందని తేలింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+