ఓనర్‌ని కాపాడేందుకు బస్సు కింద దూకిన కుక్క

న్యూయార్క్: మనుషులు చేయలేని ఆ సాహసం విశ్వాసానికి మారుపేరైన ఈ శునకం చేసింది. నమ్మిన యజమాని కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడింది. ఇదంతా అమెరికాలో తన యజమానిని కాపాడిన ఓ కుక్క ‘ఫిగో' గురించి.

వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ వాసి ఆండ్రీ స్టోన్ అనే అంధురాలు ఓ కుక్కను పెంచుకుంటోంది. దాని పేరు ఫిగో. మంగళవారం ఉదయం ఆండ్రీ స్టోన్ రోడ్డువెంట వెళ్తుండగా ఓ స్కూల్ బస్సు ఆమె వైపు వేగంగా దూసుకు వచ్చింది.

Dog jumps in front of bus to save blind owner, gets injured but stays by her side

అటుగా వెళ్తున్న ఫిగో.. దాన్ని గమనించి బస్సుకు అడ్డంగా వచ్చి పడింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు నిలిచిపోయింది. అప్పటికే కుక్క ఫిగో కాలి ఎముక విరిగింది. కాగా, ఆండ్రీ స్టోన్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఫిగోను, స్టోన్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేశారు.

సాటి మనిషి ప్రమాదంలో ఉంటే ఆదుకోవాలన్న ఆలోచన కూడా మనిషిలో కరువవుతున్న తరుణంలో ఓ కుక్క ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడుకోవడం అక్కడి వారందరినీ చలింపజేసింది. ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఫిగోపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+