• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుక్క ఉంది జాగ్రత్త: ఈ వ్యక్తి కాళ్లు చేతులు డాక్టర్లు తీసేశారు..తెలిస్తే షాక్ అవుతారు

|

ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా..? వాటితో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారా..? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుక్కలకు యజమానులపై ప్రేమ ఎక్కువైతే వాటి మూతితో నాలుకతో మన శరీరాన్ని ముద్దాడుతాయి. అందులో కుక్కకు ఉన్న విశ్వాసం , ప్రేమ మాత్రమే మనకు తెలుసు... కానీ ఆ ప్రేమ వెనక ఉన్న విషం మనం గ్రహించము. అదే ఆ కుక్కకు ఉన్న బ్యాక్టీరియా. ఇదే విషయాన్ని అమెరికా వైద్యులు బయటపెట్టారు.

కుక్క ముద్దాడింది... ప్రమాదంలో పడ్డాడు

కుక్క ముద్దాడింది... ప్రమాదంలో పడ్డాడు

అసలు విషయానికొస్తే... అమెరికాలో వైద్యులు ఓ విచిత్రమైన కేసును చూశారు. గ్రెగ్ అనే పెయింటర్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరాడు. ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాప్తి చెందకముందే ఆయన కాళ్లను డాక్టర్లు తీసేశారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్‌ ఎలా సోకిందో వివరించారు. గ్రెగ్‌కు ఓ పెంపుడు కుక్క ఉండేది. ఆ కుక్కతో చాలా సన్నిహితంగా ఉండేవాడు గ్రెగ్. అయితే అంతే ఆప్యాయత చూపించే ఆకుక్క గ్రెగ్‌ను ఎప్పుడూ తన మూతితో నాలుకతో ముద్దాడేది. కుక్క ప్రేమను చూసి గ్రెగ్ మురిసిపోయేవాడు. కానీ అప్పటి దాకా తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేసుకుంటున్నాడన్న సంగతి తెలియదు. ఎందుకంటే ఆ కుక్క అతడిని నాకడం వల్ల దానికున్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా గ్రెగ్‌కు సోకింది.

మనిషి రక్తాన్ని విషం చేయగల బ్యాక్టీరియా

మనిషి రక్తాన్ని విషం చేయగల బ్యాక్టీరియా

గ్రెగ్‌కు సోకిన బ్యాక్టీరియా పేరు క్యాప్‌నోసైటోఫాగా కానిమోర్సస్ అని డాక్టర్లు వెల్లడించారు. అది సాధారణంగా కుక్కలు, పిల్లుల్లో ఉంటుందని వివరించారు. దీంతో సాధారణంగా మనుషులకు ఎలాంటి అపాయమూ ఉండదు కానీ కొన్ని అరుదైన సంఘటనల్లో ఈ కుక్కలు పిల్లుల నుంచి వచ్చే బ్యాక్టీరియా మనుషుల రక్తాన్ని విషం చేయగలదని వైద్యులు తెలిపారు. కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం కావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ముందుగా జ్వరం ఆతర్వాత..శరీరంపై రక్తపు గాయాలు

ముందుగా జ్వరం ఆతర్వాత..శరీరంపై రక్తపు గాయాలు

ఇక గ్రెగ్ విషయానికొస్తే... కుక్క అతనిని నాకడంతో దాన్నుంచి విడుదలైన బ్యాక్టీరియా గ్రెగ్‌ను తాకింది. ముందుగా జ్వరంతో బాధపడ్డాడు, ఆ తర్వాత వాంతులయ్యాయి. ఇక కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొన్ని గంటలకే తన శరీరంపై చిన్న గాయాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది గమనించిన అతని భార్య వెంటనే దగ్గరలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఈ గాయాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని అంతకుముందు లేవని డాక్టర్లకు తెలిపింది.

రక్త ప్రసరణను అడ్డుకునే చిన్నపాటి గడ్డలు

రక్త ప్రసరణను అడ్డుకునే చిన్నపాటి గడ్డలు

గ్రెగ్ శరీరంపై కనిపించిన గాయాలు చిన్నపాటి గడ్డలని డాక్టర్లు తెలిపారు. శరీరంలో రక్త ప్రసరణను ఇవి అడ్డుకుంటాయని చెప్పారు. దీంతో శరీరంలోని కణజాలాలు మరియు కండరాలు పూర్తిగా దెబ్బతింటాయని వివరించారు. గ్రెగ్ విషయంలో కూడా ఇదే జరిగిందని అందుకే ఇక శరీరం మొత్తం ఈ బ్యాక్టీరియా పాకకుండా కాళ్లు, చేతులు తీసేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన పలువురిని షాక్‌కు గురిచేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Wisconsin man has lost both of his legs to a virulent infection after being licked by a dog, according to local reports. Earlier this summer, Greg Manteufel contracted Capnocytophaga canimorsus, a bacteria found in dog saliva that can cause sepsis doctor says.Doctors had to amputate Manteufel's hands as well.He remains in the hospital recovering from multiple surgeries.The infection likely entered Manteufel's body from the lick of a dog.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more