చూడండి: ఫేస్‌బుక్‌లో లక్షల లైక్స్ కొట్టేసిందీ వీడియో
మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోయిన ఓ ప్రగ్నెంట్ వీధికుక్కను ఓ పాదచారి కాపాడిన వీడియో ఫేస్‌బుక్‌లో కొన్ని లక్షల లైక్‌లను కొట్టేసింది. రష్యాలోని వరోని నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాదిమ్ రుస్తుం అనే పాదచారి దారిన నడుచుకుంటూ వెళ్తుండగా ఓ కుక్క అరుపులు వినిపించాయి.
అయితే ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్ధం కాలేదు. ఆ తర్వాత శ్రద్ధగా వింటే తన నడుస్తున్న కాలిబాట కింద నుంచి ఆ అరుపులు వస్తున్నాయని గమనించాడు. కుక్క అరుపులు విన్న వాదిమ్ రుస్తుం ఎలాగైనా దాన్ని రక్షించాలని అనుకున్నాడు. సిటీ అధికారులను సంప్రదించి విషాయన్ని తెలియజేశాడు.

కానీ, వాళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో తానే స్వయంగా రంగంలోకి దిగాడు. కాలిబాటను జాగ్రత్తగా తొలగించి ఆ కుక్కను బయటకు తీశాడు. రెండు రోజుల పాటు బందీగా ఉన్న ఆ కుక్క బయటకు వచ్చిన తర్వాత హాయిగా తోక ఊపుకుంటూ వెళ్లిపోయింది. ఈ తతంగం మొత్తం వీడియో రూపంలో షూట్ చేసి వాదిమ్ రుస్తుం ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా డ్రెండ్ అవుతోంది. కుక్క మ్యాన్‌హోల్‌లో చిక్కుకుపోయిన విషయాన్ని గుర్తించకుండా సెప్టెంబర్ 18న హౌసింగ్ అధికారులు మూసేశారు.












Click it and Unblock the Notifications