ట్రంప్‌తో సెల్ఫీనే ముంచింది: కాపురం కూలిపోయిందంటూ చీర్ లీడర్ ప్రెస్ నోట్
ట్రంప్‌తో దిగిన సెల్ఫీలు భర్తతో విబేధాలు తలెత్తేలా చేశాయని.. వివాదం కాస్త ముదరడంతో విడాకుల దాకా వెళ్లిందని చెప్పుకొచ్చింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వల్లే భర్తతో విడిపోయానని లిన్ అనే ఓ మాజీ చీర్ లీడర్ ప్రకటించింది. ట్రంప్‌తో దిగిన సెల్ఫీలు భర్తతో విబేధాలు తలెత్తేలా చేశాయని.. వివాదం కాస్త ముదరడంతో విడాకుల దాకా వెళ్లిందని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి లిన్ ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం గమనార్హం.
అసలు విషయంలోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన డేవ్, లిన్‌లకు 2015లో వివాహం జరిగింది. ఒకప్పుడు లిన్.. అమెరికన్ ఫుట్‌బాల్ జట్టు మయామి డాల్ఫిన్స్‌కు చీర్‌లీడర్‌గా వ్యవహరించింది. లిన్ భర్త డేవ్ పామ్ బీచ్ కౌంటీకి అటార్నీగా వ్యవహరిస్తున్నాడు.

సహజంగానే ట్రంప్ కు అభిమాని అయిన లిన్.. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పలుమార్లు ఆయనతో కలిసి సెల్ఫీలు దిగింది. ట్రంప్ మీద ఉన్న అభిమానంతో తన పెంపుడు కుక్కకు కూడా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ పేరు పెట్టుకుంది. ట్రంప్ మీద భార్యకు ఉన్న అభిమానం డేవ్ కు నచ్చలేదు. ఈ విషయాన్ని ఆమెతో అతను బలంగా వాదించేవాడు.
అలా ఇధ్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. విషయం కాస్త కోర్టు మెట్లు కూడా ఎక్కి.. విడాకులకు దరఖాస్తు చేసుకునేదాకా వెళ్లింది. వీరి అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇటీవలే విడాకులు మంజూరు చేసింది. దీంతో తాను భర్తతో విడిపోవడానికి కారణం ట్రంపే అంటూ లిన్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications