ట్రంప్‌కు షాక్: ఫోర్న్‌స్టార్ డేనియల్స్‌తో శారీరక సంబంధం, భారీ మొత్తంలో చెల్లింపులు: గిలియానీ
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోర్న్ స్టార్మీ డేనియల్స్‌కు మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ మేరకు న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియానీ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించినందుకు గాను ట్రంప్ ఆమెకు డబ్బులను చెల్లించినట్టు గిలియానీ తేల్చి చెప్పారు.
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కాకముందు ఫోర్న్ స్టార్ట్ స్టార్మీ డేనియల్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్టు ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పాల్గొన్న తరుణంలో ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ట్రంప్ తనతో ఒప్పందం కుదుర్చుకొన్నాడని ఫోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్ (స్టెఫానీ క్లిఫార్డ్) చెప్పారు.
ఈ విషయమై అమెరికాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అయితే ఈ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియానీ చేసిన ప్రకటన ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టింది.

ఫోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్‌తో ట్రంప్‌కు శారీరక సంబంధం
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే ఫోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్‌కు శారీరక సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ఫోర్న్ స్టార్ ఇటీవల కాలంలో వెల్లడించారు. అయితే దీన్ని వైట్‌హౌజ్ ఖండించింది. మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ తన లాయర్ ద్వారా ఫోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్‌కు రూ.1,30,000 డాలర్లను చెల్లించినట్టుగా న్యూయార్క్ మాజీ మేయర్ రుడి గిలియానీ స్పష్టం చేశారు. దీంతో స్టెఫానీ క్లిఫార్డ్ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది.

ఎన్నికలకు ముందే డీల్
2016 నవంబర్ మాసంలో ఫోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాడని న్యూయార్క్ మాజీ మేయర్ రుడి గిలియానీ ఓ మీడియా సంస్థకు చెప్పారు. ట్రంప్ వద్ద సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుండి ఫోర్న్‌స్టార్ డేనియల్ తాను చేసుకొన్న ఒప్పందం మేరకు నగదును తీసుకొందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫోర్న్‌స్టార్‌కు చెల్లించిన నగదుకు సమానమైన మొత్తాన్ని ట్రంప్ మైఖేల్ కోహెన్‌కు చెల్లించారని ఆయన గుర్తు చేశారు.

ఆ డబ్బు ఎక్కడిదో తెలియదు
ట్రంప్ ఫోర్న్‌స్టార్‌కు చెల్లించిన నగదు ఎక్కడిదనే విషయం తనకు తెలియదన్నారు. ఫోర్న్‌స్టార్ స్టెఫానీ ట్రంప్ తరపున ప్రచారం చేస్తే అందుకు డబ్బు ఇచ్చారని భావించవచ్చు. కానీ, ట్రంప్ తరుపున ఆమె ప్రచారం చేయలేదన్నారు. అయితే ఈ మొత్తం వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం కోసం ఇచ్చిన డబ్బుగా భావించాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

గిలియానీ ప్రకటనతో ఇరుకున పడ్డ ట్రంప్
ఫోర్న్‌స్టార్ స్టెపానీ క్లిఫార్డ్‌తో తనకు శారీరక సంబంధాలు లేవని వైట్‌హౌజ్ కొంత కాలంగా ప్రకటనలు చేస్తోంది. అయితే తాజాగా గిలియానీ చేసిన ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరుకున పెట్టినట్టైంది. 2006లో తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని గోప్యంగా ఉంచాలంటూ ట్రంప్ తన లాయర్ కోహెన్ ద్వారా 2016లో 1,30,000 డాలర్లకు తనతో ఒప్పందం చేసుకున్నారంటూ ఫోర్న్‌స్టార్ చేసిన ప్రకటన అమెరికాలో ప్రకంపనలను సృష్టించింది.












Click it and Unblock the Notifications