ట్రంప్ మరో తుంటరి పని- వేలమంది అవుట్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తోన్న ఏ ఒక్కడ్నీ వదలట్లేదు. వెంటాడుతున్నారు. చాలామందిని ఇప్పటికే చేతికి బేడీలు వేయించి మరీ వాళ్ల దేశానికి పంపించారాయన. ఇప్పుడు దీన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు.

అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అక్రమ వలసదారులను రాడికల్స్‌గా, టెర్రరిస్టులుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు.

Donald Trump administration has listed over 6000 living immigrants as dead

అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించడానికి ఏ మాత్రం అర్హులు కారనీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అప్పట్లో. ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా- అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసి పడేశారు.

నాన్ అమెరికన్లకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికారు. అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలనూ పంపించారు. అటు ఇష్టానుసారంగా టారిఫ్ పెంపుదల, ఇటు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోండటంతో భారత్ సహా అనేక దేశాలకు ఇబ్బందికరంగా పరిణమించింది.

ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. 6,000 మంది అక్రమ వలసదారులను మృతులుగా ప్రకటించారు. వారందరినీ కూడా మృతుల జాబితాలో చేర్చింది ట్రంప్ ప్రభుత్వం. సోషల్ సెక్యూరిటీ నంబర్లను రద్దు చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Donald Trump administration has listed over 6000 living immigrants as dead

ఈ నివేదిక ప్రకారం- 6,000 మందికి పైగా జీవించి ఉన్న వలసదారులను మృతులుగా జాబితా చేసింది. ఫలితంగా- వారికి సంబంధించిన అన్ని సోషల్ సెక్యూరిటీ నంబర్ల రద్దు చేసింది. వారికి ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా తలుపులు మూసివేసింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి బెనిఫిట్స్ వారికి అందకుండా అడ్డుకుంది.

జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన లక్షలాది మంది వలసదారులకు లభించే తాత్కాలిక చట్టపరమైన గుర్తింపును తొలగించే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేసినట్టయింది.

తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 6,000 మంది వలసదారులు బ్యాంకులు లేదా సోషల్ సెక్యూరిటీ నంబర్లు అవసరమయ్యే సేవలను పొందడం మరింత కష్టతరం చేసినట్టయింది. ఈ వలసదారులను డెత్ ఫైల్‌లో ఉంచడం వెనుక ముఖ్య ఉద్దేశం- వాళ్లంతా కూడా దేశం విడిచి వెళ్లడానికేనని ది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

నిజానికి- వలసదారుల పేర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లను మరణించిన వాళ్లను గుర్తించడానికి ఉపయోగించే డేటాబేస్‌లో ఉంచడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఈ 6,000 మంది అక్రమ వలసదారులను సోషల్ సెక్యూరిటీ నంబర్లు, ఇతర వివరాలను ఇదే డేటా బేస్‌లో పొందుపరిచిందక్కడి ప్రభుత్వం.

ఫలితంగా వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అందవు. దీనివల్ల వాళ్లంతా బలవంతంగా దేశం విడిచి వెళ్లక తప్పదని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినప్పటికీ- వారికి సామాజిక భద్రతను కల్పించడానికి జో బైడెన్ ప్రభుత్వం సోషల్ సెక్యూరిటీ నంబర్లను కేటాయించింది. ఇప్పుడు వాటిని ట్రంప్ సర్కార్ రద్దు చేసే ప్రక్రియ చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+