Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారతీయ అమెరికన్‌కు కీలక పదవి అప్పగించిన ట్రంప్

వాషింగ్టన్‌: ఓ భారతీయ అమెరికన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికాలోని శక్తిమంతమైన అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్‌ అమూల్‌ థాపర్‌ నియమించారు.

అమెరికా 6వ సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా అమూల్‌ను ట్రంప్‌ గత మార్చిలో నామినేట్‌ చేశారు. ఆయన నామినేషన్‌ను గతవారమే సెనేట్‌ ఆమోదించగా.. తాజాగా ట్రంప్‌ కూడా ఆమోద ముద్ర వేశారు.

Donald Trump appoints Amul Thapar as Judge on the US Court of Appeals

ఈ నియామకానికి ముందు అమూల్‌ కెంటుకీ తూర్పు జిల్లా కోర్టుకు జడ్జిగా వ్యవహరించారు. ఫెడరల్‌ బెంచ్‌కు రాకముందు అమూల్‌ అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో సబా(ఎస్ఏబీఏ) ఈయనకు పయోనీర్ అవార్డును అందజేసింది.

బోస్టన్ కాలేజీ నుంచి అండర గ్రాడ్యూయేట్ డిగ్రీ పొందిన థాపర్.. కాలిఫోర్నియా, బర్కలేలీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. కాగా, కెంటుకీ తూర్పు జిల్లాకు యూఎస్‌ అటార్నీగా, ఒహియో, కొలంబియాలోని జిల్లాలకు అసిస్టెంట్‌ యూఎస్‌ అటార్నీగా వ్యవహరించారు. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వ్యక్తి అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం ఇది రెండోసారి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+