యువతి ఛాతిపై డొనాల్డ్ ట్రంప్ ఆటోగ్రాఫ్ (ఫోటో)
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారపర్వం సందర్భంగా ఓ మహిళ ఛాతి పైన సంతకం చేశారు. డిసెంబర్ రెండో తేదిన వర్జీనియాలోని మనస్సాస్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బుధవారం నాటి ప్రిన్స్ విలియమ్ కంట్రీలో జరిగిన ఎన్నికల ర్యాలీకీ భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఓ మహిళా అభిమాని ఆటో గ్రాప్ అడిగారు. దీంతో అతను ఆమె ఛాతి పైన సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఆటోగ్రాఫ్ తీసుకున్న యువతి ఇక తాను స్నానం చేయనని చెబుతోందట. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన మాట్లాడుతూ... ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పైన పోరాడుతామని చెప్పారు.

కాగా, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు క్రూరంగా తయారవుతున్నారని ధ్వజమెత్తారు. వారు రోజురోజుకు ఆటవికులుగా తయారవుతున్నారన్నారు.
ఇతర వర్గాలకు ప్రమాదకరమవుతున్నారని వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పైన విమానాలతో ఉగ్రవాదులు దాడులు చేసిన సమయంలో ఎంతో మంది ముస్లింలు వాటిని సమర్థించారన్నారు. ముస్లీంలు ఆటవికంగా మారుతున్నారన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications