హెచ్1బీ వీసాలపై ట్రంప్ షాక్: మన ఐటీకి పెద్ద సవాల్
ఎన్నికల హామీలను అమలుచేసే దిశగా అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. గత ఏడాది చెప్పినట్లుగా అమెరికా పౌరులకే అధిక టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున
వాషింగ్టన్: ఎన్నికల హామీలను అమలుచేసే దిశగా అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. గత ఏడాది చెప్పినట్లుగా అమెరికా పౌరులకే అధిక టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
హెచ్1బీ వీసా దుర్వినియోగం, ఇందులో అవకతవకలపై దృష్టి సారించినట్లు అమెరికా హోమ్ ల్యాండ్ భద్రతా అధికారులు సోమవారం ప్రకటించారు. ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు వలస వెళ్లే సాఫ్టువేర్ (ఐటీ సంబంధిత ప్రోగ్రామర్స్, డెవలపర్స్, ఇతర టెక్నికల్ ఉద్యోగులు) రంగానికి చెందిన విదేశీ ఉద్యోగులకు ఇక నుంచి సమస్యలు తప్పేలా కనిపించడం లేదు.

మన ఐటీకి సవాల్
భారతీయ ఐటీ రంగానికి ఇది పెద్ద సవాల్‌గా మారనుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ కంపెనీలు స్థానిక కంపెనీలకే ప్రాజెక్టులు ఇవ్వడం మొదలుపెడితే భారత ఐటీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దాంతో పాటు అక్కడికి వెళ్లే సాఫ్టువేర్ ఉద్యోగులలో భారతీయుల అధికంగా ఉండటం వారిని కలవరపెడుతుంది.

లాటరీ సిస్టం
ప్రతి ఏడాది 65,000 మంది లాటరీ సిస్టం ద్వారా హెచ్1బీ వీసా అందుకుని సాఫ్టవేర్ ఉద్యోగాల పేరిట అమెరికాకు వస్తున్నారని, వీరి రాకకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు. అయితే 2018 ఏడాదికి గానూ లాటరీ సిస్టంను సోమవారం ఎలాంటి మార్పులు లేకుండా ప్రారంభించారు. గతంలో తరహాలా ఎక్కువ వీసాలు ఇవ్వరాదని, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకూడదని పూర్తిస్థాయిలో పారదర్శకత ఉండాలని అధికారులను ట్రంప్ హెచ్చరించారు.

అదీ ట్రంప్ వ్యూహం
మంచి నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు మాత్రమే ఇక్కడ అవకాశాలు కల్పించాలని, తద్వారా వారి జీతాలు రెట్టింపు కంటే అధికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో అధిక ఖర్చులకు వెనక్కి తగ‍్గడంతో పాటు అమెరికన్లకే ఉద్యోగాలు వచ్చేలా చేయాలన్నది డొనాల్డ్ ట్రంప్ వ్యూహం.

ట్రంప్ కసరత్తు
చాలా తక్కువ సంఖ్యలో హెచ్1బీ వీసాలు ఇవ్వాలని, పారదర్శకత పాటించాలని జస్టిస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ అధికార ప్రతినిధి పీటర్ రొబ్బియో తెలిపారు. అమెరికా ఉద్యోగుల కంటే విదేశీ ఉద్యోగులే సాఫ్టువేర్ రంగంలో ఇక్కడ పని చేస్తున్నారని, ట్రంప్ ఈ విషయంపై కసరత్తు చేస్తున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications