నీ బాడీని షేప్‌లో పెట్టుకో. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు

రాజకీయ ప్రత్యర్థులపై తన నోటి దురుసుతనంతో విరుచుకుపడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా ఒక జర్నలిస్ట్‌పైనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా కాన్సాస్, ఐయోవా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన సభలను ఆయన ఉన్నపళంగా రద్దు చేసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా, ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. సదరు రిపోర్టర్ ను బాడీ షేమింగ్ చేస్తూ.. దూషణకు దిగారు.

వరుస ప్రచార సభల వల్ల ఏమైనా అనారోగ్యం పాలయ్యారా? కాన్సాస్ పర్యటన రద్దుకు అదే కారణమా? అని ఒక విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా భగ్గుమన్న ట్రంప్.. "ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకే నీకు మతిస్థిమితం లేనట్లు ఉంది. నువ్వే రోగిలా ఉన్నావు" అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాను కేవలం ఆయన ఆరోగ్యం గురించే అడిగానని సదరు రిపోర్టర్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, ట్రంప్ అతడి వైపు చూపిస్తూ.. "ఈ వ్యక్తిని చూడండి, అస్సలు షేప్‌లోనే లేడు. ముందు నీ బాడీని షేప్‌లో పెట్టుకో. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు" అంటూ వ్యక్తిగత కామెంట్లు చేశారు.

Donald Trump Body-Shames Journalist After Question On Cancelled Campaign Rallies Ahead Of Midterm Elections
ఒబామా సరికొత్త వ్యూహం! ట్రంప్‌కు ఇదే ఆఖరి అవకాశం..
ఒబామా సరికొత్త వ్యూహం! ట్రంప్‌కు ఇదే ఆఖరి అవకాశం..

నా ఆరోగ్యం చాలా బాగుంది.. నాకేం కాలేదు!

తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ పూర్తిగా కొట్టిపారేశారు. గత రెండు వారాలుగా ప్రచారంలో ఉన్నానని, తాను వంద శాతం పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. రోజువారీ సభల ఒత్తిడిపై గతంలో వ్యాఖ్యానిస్తూ "ప్రతిరోజూ సభల్లో మాట్లాడేలా దేవుడు స్వరతంత్రులను తయారు చేయలేదు" అని చమత్కరించిన ట్రంప్, కాన్సాస్‌లో రిపబ్లికన్ అభ్యర్థి గెలుపుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే అక్కడకు వెళ్లాల్సిన అవసరం కనిపించలేదని సమర్థించుకున్నారు.

నేరుగా కాకుండా.. వెబ్‌ల్యాండ్ ద్వారా ప్రచారం!

కాన్సాస్‌లోని సలినా, ఐయోవాలోని డబుక్యూ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో జరగాల్సిన సభలను రద్దు చేసినట్లు రిపబ్లికన్ నేషనల్ కమిటీ ధృవీకరించింది. అయితే, స్వయంగా వెళ్లకుండా 'మాగా ఇంక్' అనే ప్రచార సంస్థ ద్వారా దాదాపు 19 రాష్ట్రాల్లో టెలీ-సభల ద్వారా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల్లో అక్రమాలు.. పట్టిస్తే ఏకంగా రూ. 8.3 కోట్లు రివార్డ్!
ఎన్నికల్లో అక్రమాలు.. పట్టిస్తే ఏకంగా రూ. 8.3 కోట్లు రివార్డ్!

అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 19 రాష్ట్రాల్లో 25 భారీ ప్రచార సభల్లో పాల్గొన్న ట్రంప్, ఫ్లోరిడాలో జరగబోయే తదుపరి కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఈ ఎన్నికలు రిపబ్లికన్లకు అత్యంత కీలకంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+