పోర్న్ స్టార్‌తో సంబంధం: అరెస్ట్ భయం- వలయంగా ఉండాలని పిలుపు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ను ఎదుర్కొంటోన్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ను ఎదుర్కొంటోన్నారు. మంగళవారం తనను అరెస్ట్ చేయొచ్చనే విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అరెస్ట్ అయ్యే పరిస్థితులే వస్తే- తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలను చేయాలని సూచించారు. ఆయన తరఫు అడ్వొకేట్ సుసాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. ట్రంప్ ను అరెస్ట్ చేయడానికి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని పేర్కొంటోన్నారు.
డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటోన్న ఆరోపణల విషయంలో వచ్చే వారం తీర్పు వెలువడనున్నట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది. ఆ ఆరోపణలు రుజువైతే మాత్రం- అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే డొనాల్డ్ ట్రంప్- తాజా ప్రకటన చేశారని, అరెస్ట్ చెయ్యొచ్చనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అడ్వొకేట్ చెప్పారు.

2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారని, దీనికోసం తన తరఫు అడ్వొకేట్ ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తం డబ్బులను చెల్లించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
2006లో ట్రంప్ తనతో సెక్స్ చేశారని స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని ఆరోపించారు. తన అడ్వొకేట్ ద్వారా ట్రంప్ 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసులో ట్రంప్ పై విచారణ కొనసాగుతోంది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదిస్తోన్నారు.
ప్రస్తుతం ఆయన 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సన్నద్ధమౌతోన్నారు. పోర్న్ స్టార్ కేసులో తనపై నేరం రుజువైనప్పటికీ- ఎన్నికల రేసులో నిల్చుంటానని, ప్రచారాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులు రుజువు అవుతాయా? లేదా? అనేది నిర్ధారణ కాకముందే- ట్రంప్ తన అరెస్ట్ గురించి మాట్లాడుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనను అరెస్ట్ చేస్తారని, అదే జరిగితే మద్దతుదారులందరూ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టాలని సూచించారు ట్రంప్.
తనను అరెస్ట్ చేస్తారనే సమాచారం- మన్ హటన్ డిస్ట్రిక్ట్ అడ్వొకేట్ ఆఫీస్ నుంచి అందిందని, తన అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారని పేర్కొన్నారాయన. దీన్ని ట్రంప్ అడ్వొకేట్ లాయర్ సుసాన్ కొట్టిపారేశారు. అరెస్ట్ కు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా ట్రంప్ లీగల్ టీమ్ తెలుస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications