ఇంత చెత్త ఫోటో జీవితంలో చూడలేదు: ట్రంప్
తన జీవితంలోనే ఇంత చెత్త ఫోటోను ఎన్నడూ చూడలేదని ట్రంప్ అన్నారు.
న్యూయార్క్: తన ముఖచిత్రంతో ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ ముద్రించిన 'అన్ ప్రెసిడెంటెడ్' అనే పుస్తకంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెదవి విరిచారు. తన జీవితంలోనే ఇంత చెత్త ఫోటోను ఎన్నడూ చూడలేదని ట్రంప్ అన్నారు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ట్రంప్ తెలియజేశారు. అయితే పుస్తకం మీద ట్రంప్ ఫోటోలు రెండు ముద్రించడంతో.. రెండింటిలో ఏ ఫోటో మీద ఆయన పెదవి విరచారన్న దానిపై స్పష్టత లేదు.
ఇదే పుస్తకం మీద ట్రంప్ ఫోటోతో పాటు హిల్లరీ ఫోటో కూడా ఉండటం గమనార్హం. పుస్తకంలో 2016 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మొదటి సంచికలో ట్రంప్ ఫోటో బాగున్నప్పటికీ.. రెండో సంచికపై ట్రంప్ ముద్రించిన ఆయన ఫోటోలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications