దయ చూపిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్‌కు తన సొంత డబ్బులు చెల్లించడానికి సిద్ధపడ్డారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ విధి నిర్వహణ కాలాన్ని ఓవర్‌టైమ్‌గా పరిగణించాల్సిన అవసరం ఉందంటూ వస్తోన్న వార్తలపై ఆయన సానుకూలంగా స్పందించారు. నిబంధనల ప్రకారం ఓవర్ టైమ్ కింద నాసా వారికి అదనపు జీతబత్యాలను చెల్లించే అవకాశం లేదని, ఆ వేతనాన్ని తాను సొంతంగా భరిస్తానని అన్నారు.

వైట్ హౌస్‌లో నిర్వహించిన రోజువారీ ప్రెస్ మీట్ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ బదులిచ్చారు. సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ ఓవర్‌టైమ్ గురించి ప్రశ్నించగా- ఈ విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. దీని గురించి తనకు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదని పేర్కొన్నారు. అవసరమైతే వారిద్దరికీ తన జేబులో డబ్బులు ఇస్తానని తేల్చి చెప్పారు.
నాసా సైంటిస్టులు, అంతరిక్ష పరిశోధకులు, వ్యోమగాములు.. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఫెడరల్ ఎంప్లాయిస్‌గా పరిగణిస్తారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వారికి కూడా ఒకేరకమైన పేస్కేల్ లభిస్తుంది.
నాసా అనుసరిస్తోన్న జనరల్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఒవర్ టైమ్ పని చేసినా లేదా ఏదైనా ఓ మిషన్‌ను పొడిగించినా అందులో పని చేసే ఉద్యోగులు, సైంటిస్టులకు ఎలాంటి అదనపు వేతనాలు లభించవు. ఓవర్‌టైమ్, వీకెండ్, సెలవు దినాల్లో పనిచేసినా సరే వారికి అదనపు చెల్లింపులు అనేవి ఉండదు.
అంతరిక్షంలోకి ప్రయాణించడం కూడా ప్రభుత్వ ఉద్యోగుల అఫీషియల్ టూర్‌గానే భావిస్తారు. వ్యోమగాముల స్పేస్ ట్రావెల్, బస, భోజన ఖర్చులను భరిస్తుంది. వారి రోజువారీ ఖర్చుల కోసం అదనంగా అయిదు డాలర్లు ఇస్తారు.
సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ మొత్తం 286 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఫలితంగా వారికి అదనంగా ఒక్కొక్కరికి 1,430 డాలర్లు అంటే 1,22,980 లభిస్తాయి. ఇది వారి జీతం 94,998 డాలర్లు అంటే 81,69,861 రూపాయలు, అదనంగా మరో 1,23,152 డాలర్లను చెల్లించాల్సి ఉంది. ఈ ఓవర్ టైమ్ మొత్తాన్ని నాసా చెల్లించలేకపోతే తాను సొంత ఖర్చుల నుంచి ఇస్తానని ట్రంప్ చెప్పారు.












Click it and Unblock the Notifications