చైనాకు ట్రంప్ కోలుకోలేని షాక్!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. వెనిజులా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో కేవలం అమెరికా వస్తువులనే కొనాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దీనివల్ల వెనిజులాపై భారీగా ఆధారపడిన చైనాకు గట్టి షాక్ తగిలినట్లయింది. వెనిజులాలో రాజకీయ సంక్షోభం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా తన చమురును విక్రయించడం ద్వారా పొందే నిధులను కేవలం అమెరికాలో తయారైన వస్తువులను కొనడానికే ఉపయోగించాలని డొనాల్డ్ ట్రంప్ నిబంధన విధించారు. ఇది చైనా ఆర్థిక ప్రయోజనాలపై నేరుగా దెబ్బకొట్టే వ్యూహంగా కనిపిస్తోంది.

ఏమిటీ కొత్త నిబంధన?
ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. వెనిజులా నుంచి సుమారు 30 నుంచి 50 మిలియన్ బారెళ్ల చమురును అమెరికా మార్కెట్ ధరకు విక్రయిస్తుంది. ఈ అమ్మకాల ద్వారా వచ్చే సొమ్మును అమెరికా ప్రభుత్వం తన నియంత్రణలో ఉంచుకుంటుంది. ఈ నిధులతో వెనిజులా కేవలం అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులు, మందులు, వైద్య పరికరాలు, విద్యుత్ గ్రిడ్ మెరుగుపరిచే పరికరాలను మాత్రమే కొనుగోలు చేయాలి.

Donald Trump Delivers Crushing Blow to China Venezuela Oil Deal Restricted to US Goods

చైనాకు భారీ షాక్!
వెనిజులా దిగుమతుల్లో ఇప్పటివరకు చైనా వాటా దాదాపు 34 శాతం వరకు ఉండేది. చైనా నుంచి వచ్చే చౌకైన వస్తువులపై వెనిజులా ఎక్కువగా ఆధారపడేది. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో వెనిజులా మార్కెట్ నుండి చైనా వస్తువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. వెనిజులాకు అమెరికా ఇప్పుడు 'ప్రధాన వాణిజ్య భాగస్వామి'గా మారుతుంది.చైనాకు రావాల్సిన పాత బాకీలు లేదా వాణిజ్య లాభాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుంది.

వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలి ఆందోళన
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎన్నడూ లేని విధంగా మచ్చ పడిందని ఆమె వ్యాఖ్యానించారు. వెనిజులాను ప్రపంచం నుండి వేరుచేసి, కేవలం అమెరికాపైనే ఆధారపడేలా చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ట్రంప్ వ్యూహం వెనుక అసలు లక్ష్యం
ఈ నిర్ణయం ద్వారా ట్రంప్ 'ఒకే దెబ్బకు రెండు పిట్టలు' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు అమెరికా రైతులకు, కంపెనీలకు భారీ వ్యాపారాన్ని కల్పిస్తూనే, మరోవైపు లాటిన్ అమెరికా దేశాల్లో చైనా ప్రభావానికి అడ్డుకట్ట వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+