ట్రంప్ చేతికి బైడెన్ ఎన్వలప్
Biden's letter to Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 2017లోనూ ఆయన ఆ దేశాధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2016 నాటి ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ తిరుగులేని మెజారిటీతో అందలం ఎక్కారు.

ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే కేపిటల్ హిల్స్ ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలను స్వీకరించారు. అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నాలకు దిగారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఇచ్చిన పలు ప్రసంగాల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన ఆర్డర్లు అవి.
ఓవల్ ఆఫీస్‌లో ఛార్జ్ తీసుకున్న సమయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు ట్రంప్. ఆ సమయంలో కొందరు విలేకరులు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ లెటర్ గురించి గుర్తు చేశారు. దీనితో ఆఫీస్ డెస్క్‌లో వైట్ కలర్ ఎన్వలప్‌లో ఉన్న లెటర్‌ను బయటికి తీశారు. వాటిని మీడియాకు చూపించారు. చదివి వినిపించారు.
అందులో 47 అని మాత్రమే రాసివుంది. ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడు కావడం వల్ల ఆ నంబర్‌ను రాసిపెట్టారు బైడెన్. అది తప్ప అందులో ఎలాంటి స్వాగత వాక్యాలు కూడా అందులో పొందుపర్చలేదు.
దాన్ని మీడియాకు చూపించిన తరువాత సానుకూలంగా స్పందించారు. బైడెన్‌కు థ్యాంక్స్ చెప్పారు. దీని కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సొచ్చిందని వ్యాఖ్యానించారు. తన తరువాత బాధ్యతలను స్వీకరించబోయే కొత్త అధ్యక్షుడి కోసం ఓ లెటర్‌ను వదిలి వెళ్లే సంప్రదాయాన్ని రొనాల్డ్ రీగన్ ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగినట్టయింది.












Click it and Unblock the Notifications