'ట్రంప్'ను తలకిందులుగా వేలాడదీసి!: కిమ్ మామూలు షాక్ ఇవ్వలేదు..
అమెరికాను ఎదుర్కోవడంలో కిమ్ ఏమాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేడు.
ప్యోంగ్‌యాంగ్: అమెరికాపై ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు బ్రేక్ పడటం లేదు. సరికదా.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. తన దందుడుకు వైఖరికి మరింత పదును పెడుతున్నాడు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తలకిందులుగా వేలాడదీస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను ఉత్తరకొరియా విడుదల చేసింది. అంతేకాదు, 'పిచ్చిపట్టిన ముసలివాడు డొనాల్డ్ ట్రంప్‌కు మరణాన్ని అందించాల్సి ఉంది' అని ఫోటోపై పేర్కొనడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి రక్తం కారుతున్నట్టుగా ఫోటోలో కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ఫోటో ఉత్తరకొరియా మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజధాని నగరం ప్యోంగ్‌యాంగ్‌కు క్షిపణులను తరలిస్తున్నట్లు ఓ చిత్రాన్ని విడుదల చేసిన కొద్దిసేపటికి ఈ ఫోటోని విడుదల చేశారు. గతనెలలో అమెరికా బాంబర్ విమానాలను పేల్చివేస్తున్నట్లుగా ఉత్తకొరియా కొన్ని ఫోటోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా ప్రపంచ దేశాల అధ్యక్షులను అమెరికా భయపెడుతూ రాగా.. అందుకు భిన్నంగా ఇప్పుడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ట్రంప్ ను భయపెడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. చిన్న దేశమే అయినప్పటికీ.. అమెరికాను ఎదుర్కోవడంలో కిమ్ ఏమాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేడు. మున్ముందు మరిన్ని క్షిపణి ప్రయోగాలతో అమెరికా వెన్నులో వణుకు పుట్టించేందుకు కిమ్ సిద్దమవుతున్నాడు.












Click it and Unblock the Notifications