ప్రముఖ మీడియా సంస్థకు బిగ్ షాక్.. 15 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా !

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనం సృష్టించారు. తనపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కథనాలు ప్రచురించిందని ఆరోపిస్తూ, ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్‌పై ఏకంగా 15 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్రూత్ సోషల్‌ వేదికగా వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు ఫ్లోరిడా రాష్ట్ర కోర్టులో ట్రంప్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ ఇప్పుడు "రాడికల్ లెఫ్ట్ డెమొక్రాటిక్ పార్టీకి అధికారిక గొంతుక"గా మారిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తనపై, తన కుటుంబం, వ్యాపారాలు, అలాగే 'అమెరికా ఫస్ట్', 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా)' ఉద్యమాలపై ఆ పత్రిక నిరంతరం అబద్ధపు కథనాలు రాసిందని ఆరోపించారు.

donald-trump-filed-a-15-billion-defamation-lawsuit-against-the-new-york-times

కాగా అధ్యక్ష ఎన్నికల ముందు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో ప్రచురించిన కథనాన్ని ట్రంప్ తప్పుబట్టారు. దీన్ని "చరిత్రలోనే అతిపెద్ద చట్టవిరుద్ధమైన ప్రచార సహకారం"గా ఆయన పేర్కొన్నారు.

తన పరువు తీయడానికి న్యూయార్క్ టైమ్స్ ఎప్పటినుంచో అబద్ధాలు రాస్తూనే ఉంది. ఇకపై అది ఆగుతుంది" అని హెచ్చరించారు. ఇదే తరహాలో, గతంలో ఏబీసీ, సీబీఎస్ వంటి నెట్‌వర్క్‌లపై దావాలు వేసి రికార్డు స్థాయిలో పరిహారం సాధించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్‌పై కూడా చట్టపరంగా చర్య తీసుకుని, ఒకప్పుడు గౌరవంగా ఉన్న ఆ పత్రిక అసలు ముఖాన్ని అమెరికా ప్రజల ముందు చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

అలానే అప్పటి అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పారామౌంట్ నిర్వహించిన 60 మినిట్స్ ఇంటర్వ్యూపై కూడా దావా వేశారు. ఆ ఇంటర్వ్యూను నెట్‌వర్క్ "మోసపూరితమైన విధంగా తారుమారు చేసింది" అని ట్రంప్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+