మహిళలపై ట్రంప్ 'సెక్స్ కామెంట్స్' : వీడియో లీకవడంతో క్షమాపణలు

వాషింగ్టన్ : గత వివాదాలన్నీ తిరగదోడుతుండడంతో.. ప్రస్తుత అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రభ మసకబారిపోతోంది. మహిళలను అవమానపరిచేలా గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజీ తాజాగా లీకవ్వడంతో.. ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఖరికి ట్రంప్ క్షమాపణలు చెప్పుకున్నప్పటికీ.. సొంత పార్టీలోనే జెబ్ బుష్ లాంటి నేతలు ట్రంప్ క్షమాపణలను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించడం గమనార్హం.

ఇంతకీ ఆ లీకైన వీడియోలో ఏముందంటే.. మహిళలను లైంగికంగా కించపరిచేలా ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. 2005లో మహిళల పట్ల ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అందులో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్త ఇప్పుడు ఎన్.బీసీ చానెల్ ద్వారా బయటకు రావడంతో.. మహిళలల్లో ట్రంప్ పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీంతో క్షమాపణలు చెప్పుకోక తప్పలేదు ట్రంప్.

Donald Trump forced to apologise as sex boast tape horrifies Republicans

మహిళలను ముద్దు పెట్టుకోవడం, వాళ్లను లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, పలువురితో లైంగిక సంబంధాలు నెరపడం.. గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికి మింగుడుపడడం లేదు. ఇదిలా ఉంటే.. తనకంటే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మరింత దారుణంగా వ్యవహరించేవారని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

ఏదేమైనా ప్రస్తుతం లీకైనా ట్రంప్ వీడియో సంభాషణల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. 'ఇది చాలా దారుణమైన వ్యవహారమని, ఇలాంటి వ్యక్తి దేశాధ్యక్షుడు కావడానికి తాము అంగీకరించమని' తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+