లోవా రాష్ట్రంలో జో బైడెన్‌పై పైచేయి సాధించిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠను కొనసాగిస్తున్నాయి. నవంబర్ 3న ఎన్నికలు జరుగనుండగా.. ముందస్తుగానే ఓటు వేసేందుకు ఎక్కువ మంది ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ జోరు చూపిస్తున్నారు.
సెల్జర్ అండ్ కో ఫర్ ది డెస్ పోల్ మోన్స్ రిజిస్టర్ అండ్ మీడియాకోమ్ అక్టోబర్ 26, 29 మధ్యలో నిర్వహించి పోల్ ప్రకారం లోవా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్‌పై పైచేయి సాధించారు. ఎన్నికలు జరుగనున్న ముందు రోజే ఈ విషయం తెలియడం డొనాల్డ్ ట్రంప్ పార్టీలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోవా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్‌కు 48 శాతం ఓట్లు రాగా, జో బైడెన్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయి. అక్టోబర్ నెలలోనే ట్రంప్, బైడెన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ యూనివర్సిటీ చేసిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్‌కు 48 శాతం ఓట్లు రాగా, బైడెన్‌కు 47 శాతం వచ్చాయి.
అయితే, అమెరికా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం డొనాల్డ్ ట్రంప్ కంటే.. జో బైడెన్ ముందుంజలో ఉన్నారని జాతీయ పోల్స్ వెల్లడిస్తున్నాయి. అమెరికాలో ముందస్తు ఓటింగ్ ఇంత భారీ స్థాయిలో జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సుమారు 90 మిలియన్లకుపైగా ఓటర్లు ముందస్తు ఓటింగ్ చేశారు. నవంబర్ 3న అమెరికా ఎన్నికలు జరుగనున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కూడా కీలకంగా మారాయి. దీంతో జో బైడెన్, డెమోక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్ భారతీయ అమెరికన్ల ఓట్లపైనే దృష్టి సారిస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ.. ప్రవాస ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశారు బైడెన్, హారీస్.












Click it and Unblock the Notifications