జాతీయ భద్రత సలహాదారుగా చైనా బద్ధ విరోధి

Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. మొన్నటి ఈ ఎన్నికల్లో ఆ దేశ 47వ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్నికలు వెలువడీ వెలువడంగానే కొత్త నియామకాలకు శ్రీకారం చుట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించిన సుసీ విల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన సంతకం చేశారు. ఎన్నికల తరువాత పెట్టిన తొలి సంతకం ఇదే.

Donald Trump has picked Mike Waltz as National Security Adviser

ఇప్పుడు తాజాగా మరో కీలకమైన నియామకంపై మలి సంతకం పెట్టారాయన. అమెరికా జాతీయ భద్రత సలహదారుగా మైక్ వాల్ట్జ్‌ను నియమించారు. 50 ఏళ్ల మైక్ వాల్ట్జ్.. రిపబ్లికన్ పార్టీ రెప్రజెంటేటివ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు అమెరికన్ నేషనల్ గార్డ్ ఆర్మీ గ్రీన్ బెరెట్ కల్నల్‌గా పని చేశారు.

చైనా అంటే ఏమాత్రం పడదు. అమెరికన్ రాజకీయాల్లో చైనా విమర్శకుడిగా గుర్తింపు పొందారంటే ఏ స్థాయిలో డ్రాగన్ కంట్రీని వ్యతిరేకిస్తోన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అనుసరిస్తోన్న విదేశాంగ విధానాలను బహిరంగంగా తప్పుపట్టారు.

అలాంటి నాయకుడిని జాతీయ భద్రత సలహాదారు పదవికి ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా చట్టాల ప్రకారం ఎన్ఎస్ఏ అపాయింట్‌మెంట్‌కు ఆ దేశ సెనెట్ ఆమోదం అవసరం లేదు. దీనితో మైక్ వాల్ట్జ్ జాతీయ భద్రత సలహదారుగా బాధ్యతలను స్వీకరించడం లాంఛనప్రాయమే.

మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం విస్తృతంగా ర్యాలీలను నిర్వహించిన నాయకుల్లో ఆయనా ఒకరు. స్వదేశానికి అనుకూలంగా విదేశాంగ విధానాలను రూపొందించడం, దాన్ని యధాతథంగా అమలు చేయగల సామర్థ్యం ఒక్క ట్రంప్‌కే ఉందంటూ ప్రచారం చేశారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ బలగాలను ఉపసంహరించుకోవడాన్ని బాహటంగా తప్పుపట్టారు.

చైనాకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే జో బైడోన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మైక్ వాల్ట్జ్ విమర్శించారు. రష్యాతో యుద్ధ సాగిస్తోన్న ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని కూడా విమర్శించారు. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సామాగ్రిని అప్పగించడం, డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం వల్ల తమ ఖజానా ఖాళీ అవుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+