వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ పని అయిపోయినట్లే!: కన్న కూతురిపై అసభ్య వ్యాఖ్యలు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డొనాల్డ్ - ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం మరింతగా పెచ్చు మీరుతుంది. ఒకరిపై మరొకరు ఎత్తులు వేస్తున్నారు. తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన వీడియో ఒకటి హల్ చల్ చేసింది.

అందులో ఆయన తన కూతురిపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే... 17 ఏళ్ల క్రితం హోవార్డ్ స్టెర్న్ అనే రేడియో జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బహిర్గతమైంది. ఈ ఇంటర్వ్యూలో తన కూతురు ఇవాంకాపై ట్రంప్‌ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

Donald Trump to Howard Stern: It's OK to Call Ivanka 'A Piece of Ass'

ఎత్తు, బరువుతో పాటు శరీర సౌష్టవం చక్కగా ఉందని చాలాసార్లు ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సీఎన్‌ఎన్ ఓ కథనం ప్రచురించింది. ఆ వీడియోలో 'చాలా మంది మహిళలు నేనంటే పడిచచ్చేవారు. నాకోసం ఏం చేసేందుకైనా వెనుకాడేవారుకాదు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

2006లో మరో ఇంటర్వ్యూలోనూ తన కూతురు మరింత సెక్సీగా కనబడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎన్‌ఎన్ ప్రచురించింది. దీంతో ట్రంప్ తీరుతో రిపబ్లికన్ పార్టీ మరింత కష్టాల్లో పడింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఆయన భార్య మెలానియా కూడా వ్యాఖ్యానించడం విశేషం.

అయితే, ఇదంతా గతమని.. అప్పటికీ, ఇప్పటికీ తన భర్త చాలా మారారన్న మెలానియా.. ట్రంప్ క్షమాపణలు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరోవైపు మహిళలపై వ్యాఖ్యలు నేపథ్యంలో అమెరికన్ల విశ్వాసాన్ని ట్రంప్ కోల్పోతున్నారు. తాజా వీడియోతో భారత అమెరికన్లు సైతం హిల్లరీకే తమ మద్దతు ప్రకటించారు.

అమెరికాలోని భారతీయలు మొదట నుంచీ డెమొక్రాట్లకే మద్దతుగా నిలుస్తున్నారు. అయితే పాక్ ఉగ్రవాదం, ఇస్లామిక్ టైస్టులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఓ వర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వీరంతా హిల్లరీకే తమ మద్దతు తెలిపారు.

'ట్రంప్‌ను శ్వేతసౌధం చేరకుండా ఆపాలి. మహిళలపై ఆయన వ్యాఖ్యలు దారుణం. తల్లి, చెల్లి, భార్య, సమాజంపై గౌరవం లేని వ్యక్తి ట్రంప్' అని కమలా హారిస్ (కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు పోటీ పడుతున్న భారత సంతతి మహిళ) వ్యాఖ్యానించారు. కాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. ఇద్దరు అసమర్థ అభ్యర్థులు బరిలో ఉన్నారంటూ ఓటర్లు వ్యాఖ్యానించారు.

English summary
A 2006 interview between Donald Trump and shock jock Howard Stern discussing the sexuality of Trump’s eldest daughter Ivanka surfaced online Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X