నరేంద్ర మోడీ ఇంగ్లీష్ భాషను అనుకరించిన డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీని అనుకరించారు. భారత ఉపఖండంలో ఆంగ్ల భాషను ఎలా మాట్లాడుతారో ట్రంప్ తెలుసుకున్నారు. మోడీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతారో గతంలోనే చూశారు. ఇప్పుడు ఆయనను అనుకరించారు.
ఆఫ్గనిస్తాన్ పైన అమెరికా విధానాన్ని గురించి చర్చిస్తున్న సమయంలో భారత యాక్సెంట్‌లో మోడీ మాట్లాడినట్లుగా ట్రంప్ మాట్లాడారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కథనం ఇచ్చింది.

గత ఏడాది ఓవల్ ఆఫీసులో మోడీతో సమావేశమైన సమయంలో మోడీ మాట తీరును ఆయన గమనించారని, ఆఫ్గన్ అధికారులతో మాట్లాడిన సమయంలో వారికి మరింత బాగా అర్థం కావాలన్న ఉద్దేశ్యంతో ఆయన తన యాసను మార్చుకున్నారని పేర్కొన్నారు.
ఆప్గన్ కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, అందుకు తాము పొందిన ప్రతిఫలం చాలా స్వల్పమని ట్రంప్ అన్నారు. మరే దేశంలో పరాయి దేశం బాగు కోసం ఇంత భారీగా ఖర్చు పెట్టలేదన్నారు. కాగా, గత అక్టోబర్ నెలలో ట్రంప్ మారియా తుఫాను బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్యూర్టోరికా యాసలో మాట్లాడారు. తన ఎన్నికల ప్రచార సభలో భారత కాల్ సెంటర్ ఉద్యోగిని మిమిక్రీ చేసి విమర్శలు కొని తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications