శవపేటికలో డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ఓపెన్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన కొన్ని రోజులకే.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఓ భారీ పోస్టర్ వెలిసింది. ఇరాన్ రాజధాని నడిబొడ్డున ఉన్న టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో, శవపేటికలో పడుకుని ఉన్న ట్రంప్ మృతదేహం చిత్రాన్ని.. దాని చుట్టూ 'ట్రంప్‌ను చంపండి' అనే సందేశాలను కలిగి ఉన్న ఓ పెద్ద బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ బెదిరించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆయన మరణించిన దాదాపు మూడు నెలల తర్వాత జులై 9న మాజీ సర్వోన్నత నాయకుడి అంత్యక్రియలు జరిగాయి.
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా మద్దతుదారులు ట్రంప్ మరణాన్ని కోరుతూ పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని తన ప్రతిజ్ఞను చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం ఓ జాతీయ అవసరం అని పేర్కొంటూ.. అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని ఆయన అన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడి పేరు ప్రస్తావించనప్పటికీ.. తన తండ్రి హంతకులను న్యాయస్థానం ముందు నిలబెడతానని ప్రతిజ్ఞ చేశారు. వారిని తమ పడకలపై ప్రశాంతంగా చనిపోవడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అంత్యక్రియల ఊరేగింపుల సమయంలో చాలా మంది "మేము ట్రంప్‌ను చంపుతాము", "ట్రంప్‌ను చంపండి" అని రాసి ఉన్న పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు.

ట్రంప్ ఎలా స్పందించారంటే?
మొజ్తాబా ఖమేనీ బెదిరింపు తర్వాత తాను కొంతకాలంగా ఇరాన్ హిట్ లిస్ట్‌లో ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. "సంవత్సరాలుగా నేను వారి జాబితాలో నంబర్ వన్‌గా ఉన్నాను" అని జూలై 8న నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. "ఇరాన్ హిట్ లిస్ట్ జాబితాలో నేను నంబర్ వన్‌గా ఉన్నాను" అని ట్రంప్ పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత జులై 10న, తనకు ఏమైనా జరిగితే ఇరాన్‌ను నాశనం చేయమని తాను ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ చెప్పారు. మరణించిన లేదా ఇతర కారణాల వల్ల పదవిని విడిచిపెట్టిన అధ్యక్షుడి ఆదేశాల గురించి అమెరికా రాజ్యాంగ పరంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత గరిష్ట స్థాయికి చేర్చాయి.
They are carzy: A banner showing Trump in a coffin has been put up in central Tehran
— NEXTA (@nexta_tv) July 15, 2026
The coffins of the president’s wife and children are also shown draped in American flags.
Donald Trump said strikes on Iran would continue until he says “enough” — and threatened to knock out… pic.twitter.com/VnZvAQofyV












Click it and Unblock the Notifications