బైడెన్‌తో టీ: ట్రంప్ ప్రమాణ స్వీకారం భారత టైమ్, కంప్లీట్ షెడ్యూల్ ఇదే: గడ్డ కట్టించే చలి
Donald Trump's swearing-in ceremony: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
భారత్‌లో ఈ కార్యక్రమం ఈ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే నాలుగేళ్లల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడతారు. అనంతరం వాషింగ్టన్ నేషనల్ క్యాథడ్రల్ ప్రేయర్ సర్వీస్‌తో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

నిజానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని వెస్ట్ ఫ్రంట్‌లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దఫా కేపిటల్ వన్ ఎరీనా రొటుండాలోకి మారింది. ఇది ఇండోర్ డయాస్. చలి తీవ్రత కారణంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇండోర్‌లోకి మార్చాల్సొచ్చింది. ప్రస్తుతం మైనస్ ఒక డిగ్రీ టెంపరేచర్ ఉందక్కడ. కేపిటల్ వన్ ఎరీనా రొటుండా సీటింగ్ సామర్థ్యం.. 20,000.
రాత్రి 9:30 గంటలకు ప్రమాణ స్వీకార వేడుకలు మొదలవుతాయి. మ్యూజికల్ పెర్‌ఫార్మెన్స్‌తో ఉంటుంది. విలేజ్ పీపుల్స్ డాన్స్ ట్రూప్‌కు చెందిన ఆర్టిస్టులు స్టేజ్ పెర్‌ఫార్మ్ చేస్తారు. పెన్సిల్వేనియా అవెన్యూ ఆఫ్ మిలటరీ రెజిమెంట్స్, స్కూల్ మార్చింగ్ బ్యాండ్స్, ఫ్లోట్స్, సిటిజెన్స్ గ్రూప్‌తో పరేడ్ వంటివి నిర్వహిస్తారు.
ప్రమాణ స్వీకారం అనంతరం వైట్ హౌస్‌లో కమాండర్- ఇన్ చీఫ్ బాల్, లిబర్టీ ఇనాగ్యురల్ బాల్, స్టార్‌లైట్ బాల్‌ను ప్రారంభిస్తారు ట్రంప్. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎన్బీసీ, సీఎన్ఎన్, ఏబీసీ, సీబీఎస్, ఫాక్స్ న్యూస్, సీ-స్పాన్ వంటి అమెరికన్ న్యూస్ నెట్‌వర్క్ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ సైతం తన అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తుంది.
ప్రమాణ స్వీకారానికి ముందు వైట్ హౌస్ సమీపంలోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు ట్రంప్. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొంటారు. అనంతరం కొత్త అధ్యక్షుడి గౌరవార్థం జో బైడెన్, కమలా హ్యారిస్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తరువాత కేపిటల్ వన్ ఎరీనాకు బయలుదేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications