రాజు వెడలె: బైడెన్‌తో చివరి భేటీ
Donald Trump's swearing-in ceremony: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
భారత్‌లో ఈ కార్యక్రమం ఈ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమౌతుంది. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు డొనాల్డ్ ట్రంప్. వచ్చే నాలుగేళ్లల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై మాట్లాడుతారు.

వైట్ హౌస్ సమీపంలోని సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొడంతో డొనాల్డ్ ట్రంప్ దినచర్య ఆరంభమైంది. భార్య మెలానియాతో కలిసి ప్రార్థనలకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. అనంతరం చర్చి నుంచి కేపిటల్ హిల్‌కు బయలుదేరి వెళ్లారు.
ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వాషింగ్టన్ డీసీ మొత్తం జనసంద్రమైంది. గడ్డ కట్టించే చలిలోనూ కేపిటల్ వన్ ఎరినా వద్ద వేలాదిమంది అమెరికన్లు గుమికూడారు. ట్రంప్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తోన్నారు. అటు ఎరినా లోపల క్రిక్కిరిసిపోయింది. 20 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఇండోర్ వేదిక ఇది.
కాగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి కొద్దిసేపటి కిందటే- డొనాల్డ్ ట్రంప్ కేపిటల్ హిల్‌కు చేరుకున్నారు. అక్కడ బైడెన్ ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. కొత్త అధ్యక్షుడి గౌరవార్థం తేనీటి విందును ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ట్రంప్ నేరుగా ఎరీనాకు వెళ్తారు.












Click it and Unblock the Notifications