ట్రంప్ మార్క్ షాక్: WHO నుంచి అమెరికా అవుట్: ఫండ్స్ కట్..!!

Donald Trump's swearing-in ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 2017లోనూ ఆయన ఆ దేశాధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2016 నాటి ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ తిరుగులేని మెజారిటీతో అందలం ఎక్కారు.

Donald Trump Inauguration Trump signs executive order to withdraw from the WHO

ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే కేపిటల్ హిల్స్‌ ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలను స్వీకరించారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఇచ్చిన పలు ప్రసంగాల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన ఆర్డర్లు అవి.

ఆయన సంతకాలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లల్లో ఒకటి- ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు సంబంధించినది. ఇందులో నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఇది- వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ హయాంలో చోటు చేసుకున్న రెండో ప్రయత్నం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమెరికా తప్పుకోవడం వల్ల డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు స్తంభించిపోతాయి. కోవిడ్ లాంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు గానీ లేదా ఇతర అంటువ్యాధులు ప్రబలినపుడు అమెరికా నుంచి అందే ప్రత్యేక నిధులు సైతం డబ్ల్యూహెచ్ఓకు అందవు. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్‌లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటోంది.

ఇందులో నుంచి తప్పుకొంటే వ్యాధులు ప్రబలిన విపత్కర సమయాల్లో పేద దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేన్ నుంచి అందే ఆర్థిక సహాయం మందగించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓకు అతిపెద్ద ఆర్థిక వనరు అమెరికానే. విపత్కర సమయాల్లో అమెరికా నుంచి నిధులు పంపిణీ ఆగిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+