వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ట్రంప్ బహుశా నన్ను ప్రేమిస్తున్నాడేమో!.. అందుకే ఆ ట్వీట్..'

ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆర్నాల్డ్ ను దీనిపై ప్రశ్నించగా.. బహుశా ట్రంప్ నన్ను ప్రేమిస్తున్నారేమోనని ఆర్నాల్డ్ చమత్కరించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను ప్రేమిస్తున్నారేమో! అని ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జనేగర్ చమత్కారంగా మాట్లాడారు. గత కొంతకాలంగా ఆర్నాల్డ్ కు-ట్రంప్ కు మధ్య 'ద న్యూ సెల‌బ్రిటీ అప్రెంటిస్'కు సంబంధించిన వివాదంపై కోల్డ్ వార్ నడుస్తోంది.

ట్రంప్ వల్లే ఆ 'షో'కు ఆర్నాల్డ్ గుడ్ బై: రేటింగ్స్ దారుణంగా పడిపోయాయ్..ట్రంప్ వల్లే ఆ 'షో'కు ఆర్నాల్డ్ గుడ్ బై: రేటింగ్స్ దారుణంగా పడిపోయాయ్..

అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'ద న్యూ సెల‌బ్రిటీ అప్రెంటిస్' అనే షోకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొనసాగడంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయని ఆర్నాల్డ్ స్క్వార్జనేగర్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన షో నుంచి కూడా తప్పుకున్నారు.

Donald Trump is probably in love with me, says Arnold Schwarzenegger

ఈ నేపథ్యంలో ట్రంప్ సైతం ఆర్నాల్డ్ పై కవ్వింపు చర్యలకు దిగారు. షో రేటింగ్స్ కు ఆర్నాల్డ్ ను బాధ్యుడిని చేస్తూ.. రేటింగ్స్ పడిపోయినందువల్లే అతన్ని షో నుంచి తప్పించామని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆర్నాల్డ్ ను దీనిపై ప్రశ్నించగా.. బహుశా ట్రంప్ నన్ను ప్రేమిస్తున్నారేమో, అందుకే అలా ట్వీట్ చేశారని ఆర్నాల్డ్ చమత్కరించారు.

కాగా, గత ఎన్నికలకు ముందు సమయంలోను ఆర్నాల్డ్ ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారంలోకి వచ్చాక కూడా తన షోకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కొనసాగడంతో చాలామంది ఆ షోకు దూరమయ్యారు. అధ్యక్షుడయ్యాక కూడా టీవీ షోల ద్వారా ట్రంప్ డబ్బులు సంపాదించాలనుకోవడం చాలామందికి నచ్చలేదు. ఈ ఎఫెక్ట్ షో పై పడటంతో రేటింగ్స్ పడిపోయాయి.

English summary
Arnold Schwarzenegger believes that President Donald Trump is “in love” with him, given the president’s obsession with his reality television successor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X