ట్రంప్ కు బిగ్ షాక్.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పెద్ద కుమారుడు..? రిపబ్లికన్ పార్టీ సంచలన నిర్ణయం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలూ అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అటు ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం కానీ ఇటు రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో తలదూర్చి పరిష్కారం చూపిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇటు భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ ట్రంప్ తన మొండి వైఖరితో భారతావని నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన పెద్ద కుమారుడు జూనియర్. డొనాల్డ్ ట్రంప్(47) బిగ్ షాక్ ఇచ్చారు. ఖతార్ లోని ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొన్న జూనియర్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష పదవిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ నుంచి తనకు పిలుపు వస్తోందని.. ఏదో రోజు తాను అమెరికా అధ్యక్షుడిగా బరిలో నిలుస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
తాజాగా ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్. డొనాల్డ్ ట్రంప్.. ఖతార్ లో నిర్వహించిన ఖతార్ ఎకానమిక్ ఫోరమ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏదో రోజు తాను అమెరికా అధ్యక్షుడిగా పోటీలో నిలబడతానని బాంబ్ పేల్చారు. ఈ మేరకు మీరు మీ తండ్రి స్థానాన్ని కోరుకుంటున్నారా..? అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

" దీనికి సమాధానం నాకు తెలియదు. మీకు తెలిసిందే. నాకు రిపబ్లికన్ పార్టీ నుంచి పిలుపు వస్తోంది. రిపబ్లికన్ పార్టీని మా నాన్న చాలా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లారు. ఆయన పార్టీని బలోపేతం చేశారు. మీరు అలా అడగుతున్నందుకు నాకు గర్వంగా ఉంది. అమెరికా అధ్యక్ష పోటీలో నిలబడే స్థాయి నాకు ఉందని భావించి నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. నాకు గౌరవంగా ఉంది. ఏదో రోజు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తా" అని జూనియర్ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జూనియర్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాల నుంచి నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయని.. ట్రంప్ బాధ్యతలు జూనియర్ ట్రంప్ తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.
-
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
స్వయానా ట్రంప్ నోట -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications