ఎన్నికల్లో అక్రమాలు.. పట్టిస్తే ఏకంగా రూ. 8.3 కోట్లు రివార్డ్!

అమెరికా రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేకెత్తించే రీతిలో దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లోగానీ, రాబోయే 2026 'మిడ్ టర్మ్' ఎన్నికల్లోగానీ ఓట్ల అక్రమాలకు పాల్పడిన వారి గురించి సరైన సమాచారం అందిస్తే ఏకంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 8.3 కోట్లు) పారితోషికంగా ఇస్తానని వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ఈ ఆఫర్‌ను బయటపెట్టారు. అయితే, ఇచ్చిన సమాచారం ఆధారంగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, వారికి కోర్టు ద్వారా శిక్ష పడితేనే ఈ రివార్డు సొమ్ము దక్కుతుందని స్పష్టం చేశారు.

Donald Trump Offers 1 Million Reward For Evidence On Voter Fraud Ahead Of Crucial 2026 Midterm Polls
అబ్బబ్బా.. ఆమె లాంటి బ్యాక్ నా జీవితంలో చూడలేదు.. ట్రంప్ వివాదాస్పద కామెంట్స్!
అబ్బబ్బా.. ఆమె లాంటి బ్యాక్ నా జీవితంలో చూడలేదు.. ట్రంప్ వివాదాస్పద కామెంట్స్!

నవంబర్ 3 ఎన్నికల పోరు

అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల వేళ ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి, అధ్యక్షుడి పదవీకాలం సగానికి వచ్చినప్పుడు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి దేశంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు, ప్రజాదరణకు పరీక్షగా నిలుస్తాయి. ఈ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని మొత్తం 435 స్థానాలతో పాటు సెనెట్‌లోని మూడో వంతు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్)లో ఏ పార్టీకి ఆధిపత్యం దక్కుతుందో ఈ ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.

చైనా విజిటర్స్ కు షాకిచ్చిన అమెరికా
చైనా విజిటర్స్ కు షాకిచ్చిన అమెరికా

ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా 'మిడ్ టర్మ్స్'

ప్రస్తుతం ట్రంప్ సర్కార్ సాధించే చట్టసభల విజయాలు, ఆయన రాబోయే నిర్ణయాలు ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాటు ట్రంప్ ప్రజాదరణ కొంత తగ్గుముఖం పట్టినట్లు కొన్ని అంతర్జాతీయ సర్వేలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. గతంలో ఎన్నికల అక్రమాలపై నిరంతరం గళమెత్తిన ట్రంప్, ఇప్పుడు ఏకంగా మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించి పారదర్శకత పేరిట విపక్షాలపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు, నాయకులకు ఈ మిడ్ టర్మ్ పోరు ఇప్పుడు సవాలుగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+