ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!

ఇరాక్/వాషింగ్టన్ం: ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్)పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ అల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చాయి. సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనాడు. ఈ విషయాన్నిదృవీకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక ట్వీట్‌ చేశారు. వయాగ్రా మాత్రలు వేసుకుని వేలాది మంది మహిళలపై అత్యాచారం చేసి వారిని కిరాతంగా హత్య చేసి ప్రపంచానికే సవాలుగా మారిన అబుబాకర్ అల్ బాగ్దాదీ చివరికి ఓ కుక్క వలన విధిలేని పరిస్థితిలో ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకుని కుక్క చావు చచ్చాడు.

పిల్లలు, మహిళలు అనే తేడా లేదు

పిల్లలు, మహిళలు అనే తేడా లేదు

ఆడ పిల్లలు, మహిళలు అంటే అబుబాకర్ అల్ బాగ్దాదీ (48) కామంతో రెచ్చిపోయేవాడు. కామవాంఛ తీర్చుకోవడానికి వయాగ్రా మాత్రలు వేసుకునే వాడు. రోజులో ఎక్కువగా మహిళల మీద అత్యాచారం చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించే బాగ్దాదీ చాలా క్రూరుడు. అమెరికా, సిరియాలతో పాటు పప్రంచాన్ని గడగడలాడించిన బాగ్దాదీని అంతం చెయ్యడానికి గత ఐదేళ్ల నుంచి అమెరికా వేచి చూస్తోంది.

ఆపరేషన్ కైలా ముల్లెర్

ఆపరేషన్ కైలా ముల్లెర్

అమెరికాలోని అరిజోనా ప్రాంతానికి చెందిన కైలా ముల్లెర్ (28) అనే మహిళ ఓ స్వచ్చందా సేవా సంస్థలో పని చేసేంది. 2013లో ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి టర్కీ నుంచి అలెప్పోకు ప్రయాణిస్తున్న సమయంలో ఆమెను ఐసిస్ కిడ్నాప్ చేసింది. తరువాత ఐసిస్ అధినేత బాగ్దాదీ అనేక రోజులు ముల్లెర్ మీద క్రూరంగా అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. 2015లో ఐసిస్ చెరలో ముల్లెర్ మరణించిందని అమెరికా ధ‌ృవీకరించింది. ఇప్పుడు అమెరికా బాగ్దాదీని అంతం చెయ్యడానికి ఆపరేషన్ కైలా ముల్లెర్ అనే పేరు పెట్టింది.

పప్రంచంలో నెంబర్ వన్ ఉగ్రవాది

పప్రంచంలో నెంబర్ వన్ ఉగ్రవాది

ఐసీస్ వంటి ఉగ్రమూకను నడిపిస్తున్న బాగ్దాదీని అంతం చేసిన ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉగ్రవాది అయిన బాగ్దాదీని అంతం చెయ్యడానికి ట్రంప్ చాలా చాకచక్యంగా వ్యవహరించారని, సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అభినందిస్తున్నారు.

ఆపరేషన్ లో రోబో ?

ఆపరేషన్ లో రోబో ?

బాగ్దాదీని అంతం చెయ్యడానికి ఒక రోబో వాడేందుకు అమెరికా సిద్దం అయ్యింది. అయితే బాగ్దాదీ దగ్గర ఆత్మాహుతి సూట్ ఉండటంతో రోబో ఆపరేటర్ మరణించే అవకాశం ఉందని అమెరికా పసిగట్టింది. ఆపరేషన్ లో రోబోను ఉపయోగించే విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది.

కుక్క చావు అంటే ఇదే

కుక్క చావు అంటే ఇదే

అర్దరాత్రి సమయంలో బాగ్దాదీ ఉన్న ఇంటి ప్రాంగణాన్ని అమెరికా హెలికాప్టర్లు చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఇంట్లోని వారు అమెరికా బలగాల మీద కాల్పులు జరిపారు. ఆ సమయంలో బాగ్దాదీ ఇంట్లో ఉన్న సొరంగంలోకి వెళ్లిపోయాడు. అప్పటికే సొరంగం గురించి అవగాహన ఉన్న అమెరికా దళాలు ఓ కుక్కను సొరంగంలోకి వదిలాయి. కుక్క వెంబడించడంతో సొరంగం చివరికి వెళ్లిన బాగ్దాదీ టన్నల్ నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆమెరికా దళాలకు భయపడి ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకోవడంతో కుక్కచావు చచ్చాడు.

2011 లాడెన్, నేడు బాగ్దాదీ

2011 లాడెన్, నేడు బాగ్దాదీ

గతంలో ఆల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ను హతమార్చడానికి అమెరికా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. అమెరికా సైనికుల బలగాల దెబ్బకు బిన్ లాడెన్ విలవిలలాడిపోయాడు. కోట్లాది మంది అమెరికా ప్రజలకు నిద్రలేకుండా చేసిన బిన్ లాడెన్ ను ఎలాగైనా అంతం చెయ్యాలని అమెరికా నిర్ణయించింది. 2011లో జరిగిన సీక్రెట్ ఆపరేషన్‌లో బిన్ లాడెన్ అంతం అయ్యాడు. బిన్ లాడెన్‌ను అంతం చేసినట్లే ఇప్పుడు అమెరికా సైనిక బలగాలు అబుబాకర్ అల్ బాగ్దాదీని అంతం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+