పౌరసత్వం లేకుంటే అమెరికా నుంచి ఔట్: ట్రంప్
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్న వాళ్లను దేశం నుంచి బయటకు పంపేస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.
అరిజోనాలో ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోకి ఇప్పటి దాకా కోటి మంది అక్రమంగా ప్రవేశించారని అన్నారు.
వాళ్లందరూ తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలని, మళ్లీ వీసాలకు దరఖాస్తు చేసుకుని రావల్సిందే అని ట్రంప్ చెప్పారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి పౌరసత్వం పొందాలనుకుంటే అది కుదరదని ట్రంప్ అన్నారు.

ఏదో ఒక విధంగా అమెరికాలోకి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారని, తరువాత చట్టబద్దత పొందాలని ప్రయత్నిస్తున్నారని విదేశీయులను తీవ్ర స్థాయిలో విమర్శించారు. సరైన పత్రాలు లేనివారిని అమెరికా నుంచి బయటకు పంపేయడం తన ప్రధాన లక్షం అని ట్రంప్ చెప్పారు.
అమెరికా- మెక్సికో మధ్య సరిహద్దు గొడ నిర్మించడానికి తాను ఒక్క పైసా ఇవ్వనని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారం సందర్బంగా ట్రంప్ గొడ నిర్మించడానికి మెక్సికో డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications