Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హార్వర్డ్ యూనివర్శిటీకి బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్

Donald Trump vs Harvard University: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలు, జారీ చేస్తోన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికా మేక్ గ్రేట్ అగైన్ కాన్సెప్ట్ కింద ప్రపంచ దేశాలపై ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ వ్యవహారం.. అక్కడి వాళ్లకే రుచించట్లేదు. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే రోడ్డెక్కారు అమెరికన్లు.

అదే సమయంలో- మరో వివాదం తెర మీదికి వచ్చింది. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేసింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్త అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడాన్ని అవకాశం లేకుండా చేసింది.

Donald Trump s administration block Harvard University s ability to enrol international students

2025- 2026 విద్యా సంవత్సరంలో ఏ ఒక్క విదేశీ విద్యార్థి కూడా హార్వర్డ్ యూనివర్శిటీలో అడ్మిషన్లు పొందలేరు. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్ ఆదేశాల ప్రకారం- ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు తమ విసాను కొనసాగించుకోవాలనుకుంటే ఇప్పుడు మరో విద్యాసంస్థ లేదా యూనివర్శిటీకి బదిలీ కావాల్సి ఉంటుంది.

స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ రద్దు అంటే 2025-2026 విద్యా సంవత్సరానికి ఎఫ్ లేదా జే వలసేతర హోదాపై ఉన్న ఏ గ్రహాంతరవాసులు (విదేశీ విద్యార్థులు) హార్వర్డ్ లో అడ్మిషన్లు పొందడాన్ని నిషేధించినట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ ప్రకటన జారీ చేసింది.

ఇప్పుడున్న విద్యార్థులను మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ చేయాలని ఇందులో పొందుపరిచింది. ఈ మేరకు ఈ ఉత్తర్వులను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీస్ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

హార్వర్డ్ యూనివర్శిటీ అధికారులు హింసాత్మక పరిస్థితులు, యూదుల పట్ల వ్యతిరేకతను పెంపొందించడం, క్యాంపస్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలను కలిగివుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. యూనివర్శిటీలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి అధిక ట్యూషన్ చెల్లింపుల నుండి ప్రయోజనం పొందడం సరికాదని చెప్పారు.

పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ, గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థులను వీసాలు రద్దు చేసి, వారిని దేశం నుంచి బహిష్కరించేలా గతంలో ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

అంతకుముందు ప్రభుత్వం ఫండింగ్‌ను నిలిపివేయడం దుమారం రేపింది. నిధులను నిలిపివేయడాన్ని యూనివర్శిటీ బోర్డు తప్పు పట్టింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిధులను నిలిపివేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఈ మేరకు బోస్టన్ ఫెడరల్ కోర్టులో సూట్ ఫైల్ చేసింది.

యూనివర్శిటీ వ్యవహారాలను పరిమితం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తామంటూ అప్పట్లో స్పష్టం చేసింది బోర్డ్. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలో దిగింది. హార్వర్డ్ యూనివర్శిటీకి 2.3 బిలియన్లకు పైగా మంజూరు చేయాల్సిన గ్రాంట్ల తక్షణమే నిలిపివేయాలంటూ ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు ట్రంప్.

ఈ మేరకు హార్వర్డ్‌ యూనివర్శిటీకి లేఖ రాశారు. యూనివర్శిటీ బోర్డును సంస్కరించాల్సిన అవసరం ఉందని, అడ్మిషన్ల వ్యవస్థలతో మార్పులు చేయాలంటూ సూచించింది. యూనివర్శిటీ నిధుల వినియోగంపై సమగ్ర నివేదిక అందజేయాలని, ఆడిట్ సైతం చేయాలని ఆదేశించింది.

విద్యార్థి క్లబ్‌లను అధికారికంగా గుర్తించడాన్ని కూడా నిలిపివేయాలని, వాటికి ఆర్థికంగా ఎలాంటి సహాయ సహకారాలను కూడా అందజేయకూడదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ చేసింది. గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్శిటీ క్యాంపస్ భారీగా నిరసనలు చెలరేగాయి.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు క్యాంపస్‌లో చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. హార్వర్డ్ సహా వివిధ యూనివర్శిటీలు యూదుల పట్ల వ్యతిరేకతను పెచ్చరిల్లేలా చేశాయని అభిప్రాయపడింది. దీన్ని కట్టడి చేయడానికి నిధుల్లో కోత పెట్టింది. 2.3 బిలియన్ డాలర్లను నిలిపివేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+