‘మాఫియా డాన్‌’తో డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధాలు!

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న వివాదాస్పద నేత డొనాల్డ్ ట్రంప్‌‌కు మాఫియాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. మాఫియా డాన్‌, జెనోవెస్ నేర సామ్రాజ్యం అధినేత ఆంతోనీ 'ఫ్యాట్ టోనీ' సాలెర్నొతో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నట్టు తాజాగా తేలింది.

రియల్‌ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్.. ట్రంప్‌ టవర్‌, ట్రంప్ ప్లాజా నిర్మించడానికి మాఫియా డాన్‌ ఫాట్‌ టోనీకి చెందిన కంపెనీలతో రహస్యంగా ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రముఖ జర్నలిస్టు డేవిడ్‌ కే జాన్‌స్టన్‌ బహిర్గత పర్చారు. పులిట్జర్‌ అవార్డు గ్రహీత అయిన జాన్‌స్టన్‌ 'పొలిటికో' పత్రికలో ట్రంప్‌-మాఫియా డాన్‌ సంబంధాలపై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు.

పలు కేసుల్లో దోషిగా తేలి శిక్ష ఎదుర్కొన్న ఫ్యాట్‌ టోనీకి సంబంధాలు ఉన్న కంపెనీలతో ట్రంప్‌ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వెల్లడైంది. ట్రంప్‌కు మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు కథనాలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మాఫియాతో ఆయనకు లింకులు ఉన్నట్టు కథనాలు వెలువడ్డాయి.

Donald Trump's hidden business dealings with Mafia boss Fat Tony

తాజాగా వెలువడిన పరిశోధనాత్మక కథనంలో ట్రంప్‌కు, ఫ్యాట్ టోనీకి మధ్య ఎలా రహస్య వ్యాపార ఒప్పందాలు కుదిరాయో వివరిస్తూ పలు పత్రాలు బహిర్గతమయ్యాయి.

కాగా, ఈ కథనాన్ని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ కొట్టిపారేశారు. ఫ్యాట్‌ టోనీతో తనకు సంబంధాలు లేవని, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాన్ని ప్రచురించినందుకు జర్నలిస్టు జాన్‌స్టన్‌పై కేసు వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇలాంటి మాఫియా ఆరోపణలు రావడంతో ట్రంప్ కొంత ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+