గెలవగానే షాకిచ్చిన ట్రంప్, జర్నలిస్ట్‌లు అడగటంతో యూ టర్న్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు! ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన ముస్లీంల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశంలో ముస్లీంలను ఉండకుండా చేస్తానని ప్రకటించారు.
అయితే, అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన రూటు మార్చారు! తాజాగా, తన ట్రంప్ వెబ్‌సైట్ నుంచి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా ఉన్న ముస్లీంల పైన బ్యాన్ అనే దానిని తొలగించారు. అది లేకపోవడంపై ఆశ్చర్యం కావడం అందరి వంతయింది.
ఆయన అధ్యక్షుడు అయ్యాక ఆయన సైట్ నుంచి ముస్లీం బ్యాన్ అనే హామీ ఎగిరిపోయింది. అయితే, ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్లీ అది కనిపించింది.

కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డిలో ఉగ్రదాడి తర్వాత గత డిసెంబరులో ట్రంప్ ముస్లీంల పైన వ్యాఖ్యానించారు. దీనిని ట్రంప్ ఎలక్షన్ ప్రచార వెబ్‌సైట్లో ఉంచారు. దేశంలోకి రాకుండా ముస్లీంలను అడ్డుకుంటామని ఆయన ఆనాడు ప్రకటించారు.
వెబ్ సైట్ నుంచి హఠాత్తుగా ఆ హామీ కనుమరుగు కావడంపై జర్నలిస్టులు గురువారం నాడు ఆయనను ప్రశ్నించారు. దీంతో ఆ హామీ మళ్లీ వెబ్ సైట్లో ప్రత్యక్షమైంది. సాంకేతిక కారణాల వల్లే అలా జరిగిందని ట్రంప్ ప్రచార గ్రూప్ పేర్కొంది.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!












Click it and Unblock the Notifications