సిరియాపై క్షిపణి దాడి: ట్రంప్‌కు హిల్లరీ, 'అమెరికా-రష్యా మధ్య అణుయుద్ధం!'

సిరియాలోని ఇటీవల జరిగిన నరమేధాన్ని అడ్డుకునేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. తిరుగుబాటుదారులు అధికంగా ఉండే ప్రాంతాలపై క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప

వాషింగ్టన్: సిరియాలోని ఇటీవల జరిగిన నరమేధాన్ని అడ్డుకునేందుకు అమెరికా చర్యలు ప్రారంభించింది. తిరుగుబాటుదారులు అధికంగా ఉండే ప్రాంతాలపై క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్రువీకరించారు. సిరియాలో క్షిపణి దాడులకు ఆదేశించినట్లు వెల్లడించారు.

సిరియాలో ఇటీవల జరిగిన రసాయన దాడులకు ప్రతీకార చర్యగానే క్షిపణి దాడులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. మధ్యధరా సముద్రంలోని యుద్ధ నౌక నుంచి 59 తోమహౌక్‌ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. సిరియాపై అమెరికా నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి.

డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక తీసుకున్న కీలక మిలిటరీ ఆదేశాలు ఇవే. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా సిరియాపై అమెరికా ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలో టీవీ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడారు.

ట్రంప్ ప్రకటన ఇలా..

ట్రంప్ ప్రకటన ఇలా..

అమెరికా న్యాయానికి కట్టుబడి ఉంటుందని ట్రంప్ చెప్పారు. ఇటీవల సిరియాలో జరిగిన రసాయన దాడులు ఆ దేశాధినేత బాషర్‌ అల్‌ అసద్‌ చేయించినవేనని ఆరోపించారు. ఎంతోమంది అమాయక ప్రజలు ఆ దాడుల్లో మరణించారని, దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేశామని ట్రంప్ తెలిపారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు ముప్పు ఏర్పడిందన్నారు.

సంక్షోభం ముగింపునకు తమతో కలిసి రావాలని ఇతర దేశాలను కోరామని చెప్పారు. సిరియాలో మారణకాండ, రక్త ప్రవాహం ఆగాలన్నారు. తీవ్రవాదం అంతే చేసే విషయంలో మాతో అందరూ నడవాలన్నారు. గాయపడ్డ వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాననని చెప్పారు.

అసద్ నిందితుడని ఆగ్రహం

అసద్ నిందితుడని ఆగ్రహం

సిరియాలో ఇటీవల రసాయన దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారులు సహా 70మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దాడులు ఎవరు చేశారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధ్యక్షుడే దాడులకు పాల్పడి ఉంటారని కొన్ని దేశాలు అనుమానిస్తున్నాయి. అసదే హంతకుడు అని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ మండిపడ్డారు.

సిరియాలో చిన్నారులు సహా 100 మందిని విషవాయువులు ప్రయోగించి బలిగొన్న ఉదంతంలో అసద్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు తప్పుబట్టడం గమనార్హం. అసద్‌కు బాసటగా వైమానిక దాడులు జరుపుతున్న రష్యా తీరును తప్పుబడుతున్నారు.

క్షిపణి దాడులపై సిరియా ఆగ్రహం

క్షిపణి దాడులపై సిరియా ఆగ్రహం

అమెరికా క్షిపణి దాడులను సిరియా తీవ్రంగా ఖండిస్తోంది. అలాగే, సిరియాలో చిన్నారులు సహా 100 మంది మృతి చెందడంపై తమకు సంబంధం లేదని చెబుతోంది. మా ప్రజలపైనే కాదు, తిరుగుబాటుదారులపైనా గతంలో ఎన్నడూ విషవాయువులు ప్రయోగించలేదని, ఇకముందు జరపమని సిరియా వెల్లడించింది.

రష్యా విఫలమైందు.. అందుకే..

రష్యా విఫలమైందు.. అందుకే..

సిరియా విషయంలో రష్యా విఫలమైందని అమెరికా ఆరోపించింది. రసాయన ఆయుధాల బారి నుంచి సిరియాను రక్షిస్తామని 2013లో తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడంలో ఆ దేశం ఘోర వైఫల్యం చెందిందని అమెరికా ప్రభుత్వ సహాయ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ అన్నారు. కాగా, వచ్చే వారం ఆయన మాస్కో వెళ్లనున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిధిగా తొలిసారి రష్యాలో వచ్చే వారం టిల్లర్సన్ అడుగు పెట్టనున్నారు.

హిల్లరీ చెప్పిన కాసేపటికే..

హిల్లరీ చెప్పిన కాసేపటికే..

సిరియాలో అమెరికా వైమానిక దాడుల విషయాన్ని హిల్లరీ క్లింటన్ ముందే చెప్పారు. ఆమె ఎన్‌బీసీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. అసద్ అల్ బషర్ వైమానిక స్థావరాల మీద అమెరికా దాడి చేయాలన్నారు. ఆ దేశంలో చాలా వరకు పౌరుల మరణాలకు సిరియా వైమానిక దళమే కారణమని, అందువల్ల సిరియా అధ్యక్షుడి నియంత్రణలో ఉన్న మొత్తం అన్ని వైమానిక స్థావరాలను మనం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత కాసేపటికే వైమానిక స్థావరంపై తోమహక్ క్షిపణులు విరుచుకుపడ్డాయి.

కాంగ్రెస్ అనుమతి లేకుండానే..

కాంగ్రెస్ అనుమతి లేకుండానే..

అమెరికా తరఫున ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలన్నా అందుకు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. కానీ సిరియా మీద దాడి విషయంలో ట్రంప్ మాత్రం కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే దాడులకు పచ్చ జెండా ఊపారు. ఇంతకుముందు ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా దాడులు జరిగాయి. అప్పట్లో మాత్రం కాంగ్రెస్‌లో విస్తృతంగా చర్చించాక రంగంలోకి దిగారు.

ప్రమాద ఘంటికలు.. అమెరికా హిందూ నేత

ప్రమాద ఘంటికలు.. అమెరికా హిందూ నేత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను హవాయిన్ ప్రాంతం నుంచి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ మహిళ, డెమోక్రటిక్ తులసీ గబార్డ్ తప్పుబట్టారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా నిర్లక్ష్యపూరితంగా సిరియాపై దాడి చేయించారని మండిపడ్డారు. అసలు దూరదృష్టి లేదన్నారు. ట్రంప్ పాలన వర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు.

సిరియాపై దాడులు చేస్తే తదుపరి జరగబోయే పరిణామాలు ఏమిటనే విషయంలో ఎవరినీ సంప్రదించలేదన్నారు. అదీ కాకుండా అసలు సిరియాలో జరిగింది రసాయన దాడులా కాదా అని నిర్ధారించుకోలేదన్నారు. ఇవేం చేయకుండానే ఏకపక్షంగా దాడి సరికాదన్నారు.

అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు...

అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం జరగొచ్చు...

ట్రంప్ చేసిన ఈ పని తనను చాలా బాధించిందని తులసి అన్నారు. కోపాన్ని కూడా కలిగించిందన్నారు. ఇది అల్ ఖైదాను మరింత బలోపేతం చేస్తోందని హెచ్చరించారు. వారు ఇంకా ఎంతోమంది సిరియాలోని అమాయకులను పొట్టన పెట్టుకోవచ్చునని చెప్పారు. ఎంతోమంది శరణార్థులుగా మారవచ్చునని చెప్పారు. అంతేకాకుండా అమెరికా, రష్యా మధ్య అణుయుద్ధం కూడా జరిగే అవకాశముందని తులసి గబార్డ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సిరియాపై అమెరికా దాడులను బ్రిటన్ సమర్థించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+