నేనొస్తే అలా.., అందుకే హిల్లరీవైపే మొగ్గుచూపారు: ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తనకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలను డొనాల్డ్‌ ట్రంప్‌ కొట్టిపారేశారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారన్నారు.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తనకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆరోపణలను డొనాల్డ్‌ ట్రంప్‌ కొట్టిపారేశారు. నిజానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హిల్లరీ క్లింటనే అధ్యక్షురాలు కావాలని కోరుకున్నారని ప్రకటించారు. ఆమెకు అధికారం వస్తే అమెరికా బలహీనమవుతుందని పుతిన్ అంచనా వేశారని వెల్లడించారు.

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తను, పుతిన్‌ తమ దేశాల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. జర్మనీ నగరం హాంబర్గ్‌లో గత వారం నిర్వహించిన జీ-20 సదస్సులో వీరిద్దరూ భేటీ కావడం తెలిసిందే.

putin-trump

'మా సైన్యం బలోపేతానికి నేను అధిక శ్రద్ధ చూపాను. హిల్లరీ అధికారంలోకి వచ్చి ఉంటే సైన్యం బలహీనంగా మారేది. ఇంధనం ధర మరింత పెరిగేది. అందుకే పుతిన్ నన్ను వ్యతిరేకించారు' అని ట్రంప్ వివరించారు.

ట్రంప్‌ అభిశంసనకు తీర్మానం

అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి అనుమతించి న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించినందున ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ డెమోక్రాట్‌ ఎంపీ బ్రాడ్‌ షెర్మన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. మరో డెమోక్రాట్‌ సభ్యుడు అల్‌ గ్రీన్‌ దీనిపై సంతకం చేశారు.

అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. పార్లమెంటులో రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్నందున ఈ తీర్మానాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. డెమోక్రాట్లకు ప్రతినిధుల సభలో తగిన మెజారిటీ లేకపోవడమే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+