ఇంకెన్ని చేస్తారు సార్!.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం!!

అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలను తీవ్రంగా పరిగణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యంలోకి వలసలను నియంత్రించే దిశగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ, ఎంఐటీ ప్రాంగణాల్లో జరిగిన దాడుల నేపథ్యంలో 'డైవర్సిటీ వీసా లాటరీ' (గ్రీన్ కార్డ్ లాటరీ) ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పోర్చుగల్‌కు చెందిన క్లాడియో నెవెస్ వాలెంటే (48) అనే వ్యక్తి బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపి ఇద్దరు విద్యార్థులను చంపగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అంతేకాకుండా ఒక ఎంఐటీ ప్రొఫెసర్‌ను కూడా ఇతనే చంపినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు గురువారం సాయంత్రం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు 2017లో గ్రీన్ కార్డు లాటరీ ద్వారా అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాడు. అంతకు ముందు 2000వ సంవత్సరంలో అతను బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థిగా కూడా ఉన్నాడు.

Donald Trump Shocking Move US Suspends Green Card Diversity Lottery Program

ప్రభుత్వ చర్య.. గ్రీన్ కార్డు లాటరీ రద్దు
నిందితుడు లాటరీ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించాడని తెలియడంతో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్, ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. "ఇలాంటి దుర్మార్గులు మన దేశంలోకి ప్రవేశించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండకూడదు" అని ఆమె పేర్కొన్నారు.

డైవర్సిటీ వీసా లాటరీ అంటే ఏమిటి?
అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల పౌరులకు ప్రతి ఏటా లాటరీ ద్వారా 50,000 గ్రీన్ కార్డులను కేటాయిస్తారు. 2025 లాటరీ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో పోర్చుగల్ దేశస్థులు కేవలం 38 మంది మాత్రమే ఉన్నారు. సాధారణంగా ఇండియా నుంచి అమెరికాకు వలసలు ఎక్కువగా ఉన్నందున.. భారతీయులు ఈ లాటరీకి ఎప్పటి నుంచో అనర్హులుగా ఉన్నారు. కాబట్టి ఈ రద్దు వల్ల భారతీయులకు నేరుగా వచ్చే నష్టమేమీ లేదు.

ఈ లాటరీని అమెరికన్ కాంగ్రెస్ చట్టబద్ధంగా రూపొందించింది. కాబట్టి అధ్యక్షుడు నేరుగా రద్దు చేయడంపై కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం విషాదకరమైన కాల్పుల ఘటనలను అడ్డుపెట్టుకుని తన ఇమ్మిగ్రేషన్ విధానాలను (ముఖ్యంగా వలసల తగ్గింపు) బలవంతంగా రుద్దుతోందని మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ట్రంప్ తన మొదటి పదవీకాలం నుంచే ఈ లాటరీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో అమెరికా వలస విధానంలో మరిన్ని కఠిన మార్పులు రానున్నాయని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+