భారత జర్నలిస్ట్ ప్రశ్నతో నోరెళ్లబెట్టిన డొనాల్డ్ ట్రంప్!
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇదే సమయంలో అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం, ఎరువులను దిగుమతి చేసుకుంటున్న విషయంపై ఒక భారతీయ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పలేకపోయారు. ఈ సంఘటన అంతర్జాతీయ వేదికపై అమెరికా ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెట్టింది.
ట్రంప్, భారతీయ జర్నలిస్ట్ మధ్య సంభాషణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి పెంచుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే విలేకరుల సమావేసంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఒక భారతీయ జర్నలిస్ట్ వేసిన ప్రశ్న ట్రంప్‌ను ఇరకాటంలో పడేసింది. "అమెరికా రష్యా నుంచి యురేనియం, ఎరువులు వంటి కీలక వస్తువులను కొనుగోలు చేస్తూ.. భారత్ మాత్రం రష్యా నుంచి ఇంధనం కొనడంపై ఎందుకు విమర్శలు చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏంటి?" అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ట్రంప్ "నాకు ఈ విషయం తెలియదు" అని సంక్షిప్తంగా సమాధానమిచ్చారు. తద్వారా ఈ అంశంపై ఆయనకు సరైన అవగాహన లేదని స్పష్టమైంది.
Journalist: India says the U.S. buys Russian uranium and fertilizers while criticising India for buying Russian energy. Your response?
— श्रवण बिश्नोई (किसान/ Hindus) (@SKBishnoi29Rule) August 6, 2025
Trump: I don’t know anything about that.
US President Donald Trump has no knowledge about his own country and imposing tarrif on Bharat. pic.twitter.com/vjMzpyZuNF

భారత్ వైఖరి, అమెరికాపై విమర్శలు
రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత్‌పై 25 శాతం కంటే ఎక్కువ సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా వైఖరిని "ద్వంద్వ వైఖరి"గా అభివర్ణించింది. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ సమర్థించుకుంటూ, అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి తమ వాణిజ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాయని ఆరోపించింది. విదేశాంగ మంత్రిత్ర శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికా కంపెనీలు అణు పరిశ్రమల కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియం, ఇతర రసాయనాలను రష్యా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. అదే సమయంలో భారత్ తన వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వారి పక్షపాత ధోరణికి నిదర్శనమని పేర్కొంది.
యరేనియం సరఫరాదారులలో రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటి. అమెరికా అణు విద్యుత్ పరిశ్రమలో ఉపయోగించే ఇంధనంలో దాదాపు 12-15 శాతం రష్యా నుంచి దిగుమతి అవుతుంది. రష్యా నుంచి వచ్చే యురేనియం హెక్సాఫ్లోరైడ్ అణు విద్యుత్ కేంద్రాల రియాక్టర్లలో కీలకమైన ఇంధనాన్ని తయారు చేయడానికి ఒక ముఖ్యమైన ముడిసరుకు. దీనిపై అమెరికా ఆధారపడటం వారి ద్వంద్వ వైఖరికి ఒక స్పష్టమైన ఉదాహరణ.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై సుంకాలు?
రష్యా నుంచి ఇంధనం కొంటున్న దేశాలపై 100 శాతం సుంకం విధించడం సాధ్యమేనా అని ట్రంప్‌ను అడిగినప్పుడు, ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. "మేము శాతం ఏమీ నిర్ణయించలేదు, కానీ చాలా చేస్తాం. మేము ఈ దిశగా పెద్ద చర్యలు తీసుకోబోతున్నాం, త్వరలోనే చూస్తారు" అని అన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడమే తమ లక్ష్యమని, ఈ విషయమై అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ బుధవారం మాస్కోలో రష్యా నాయకత్వంతో సమావేశం అవుతారని తెలిపారు.












Click it and Unblock the Notifications