క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్‌హౌస్ కామెంట్.. !
న్యూఢిల్లీ: భారత చలన చిత్ర పరిశ్రమలో అయిదేళ్ల పాటు వినిపించిన మూవీ.. బాహుబలి: ది బిగినింగ్..బాహుబలి: ది కన్‌క్లూజన్. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. బాక్సాఫీసును కొల్లగొట్టింది. కొమ్ములు తిరిగిన హాలీవుడ్ దర్శకులకు సాధ్యం కాలేని 2000 కోట్ల కలెక్షన్స్ మార్క్‌ను అందుకుంది. బాహుబలి.. అందులోని సన్నివేశాలు.. టైటిల్ సాంగ్.. మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
బాహుబలి టైటిల్ సాంగ్‌లో ట్రంప్..
తన మొట్టమొదటి భారత పర్యటనకు సరిగ్గా ఒక్కరోజు ముందు- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బాహుబలి టైటిల్ సాంగ్‌తో రూపొందించిన ఓ వీడియో క్లిప్‌ను రీట్వీట్ చేశారు. `లుక్ సొ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ మై గ్రేట్ ఫ్రెండ్స్ ఇన్ ఇండియా.. అని కామెంట్స్‌ను దానికి జత చేశారు. ఈ వీడియో క్లిప్పుల్లో కనిపించిన ప్రభాస్‌కు బదులుగా ఆటోమేటిక్‌గా డొనాల్డ్ ట్రంప్ ముఖాన్ని అతికించారు. నిమిషం 20 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ట్రంప్ రీట్వీట్ చేశాడం మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది పొలిటికల్‌గా.

ట్రంప్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని మార్ఫింగ్ చేసిందే..
డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను దృష్టిలో ఉంచుకుని మార్ఫింగ్ చేసిన వీడియో ఇది. ఇదేదో పాత మార్ఫింగ్ వీడియో క్లిప్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే- సినిమా చివర్లో శుభం కార్డు పడినట్టుగా.. ఈ వీడియో క్లిప్ ఎండ్‌లో యుఎస్ఏ అండ్ ఇండియ యునైటెడ్ అనే కార్డ్ పడుతుంది. సోల్- సోల్‌మెమెస్1 అనే ట్విట్టర్ నుంచి ఈ వీడియో బయటికి వచ్చింది. ఈ ట్విట్టరెట్టీ ఈ వీడియోను ట్రంప్ ట్యాగ్ చేశారు. ఇది కాస్తా ఆయన దృష్టిలో పడింది. రీట్వీట్ చేశారు.

ట్రంప్ ఫ్యామిలీ మొత్తం..
డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ మొత్తాన్నీ ఈ వీడియో క్లిప్‌లోకి తీసుకొచ్చారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడికి ఈ వీడియోలో చోటిచ్చారు. ఒకట్రెండు వార్ సీన్లతో పాటు రమ్యకృష్ణ కనిపించాల్సిన చోట మెలానియా ట్రంప్ ఫేస్‌ను అమర్చారు. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను భుజాల మీద ఎత్తుకున్నట్లుగా చూపించారు. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ.. భారత్‌లోని తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ ట్రంప్ రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!












Click it and Unblock the Notifications