ముస్లింలపై డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముస్లింలపై వివక్ష వీడాలంటూ పిలుపునిచ్చిన వెంటనే మార్చి 2016లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'ఉగ్రవాద సమస్య ప్రమాదాన్ని, ముప్పును గుర్తించనంత వరకూ భయంకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇకముందు ఉగ్రదాడులకు మన దేశంలోని పౌరులు బలి కాకూడదు. వారు జిహాదీని నమ్ముకున్నారు. అమెరికా పట్ల ముస్లింల వైఖరి తెలిసే వరకు వారి ప్రవేశాన్ని నిషేధించాలి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలిఫోర్నియాలో ఓ ముస్లిం జంట విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ఒబామా మాట్లాడుతూ ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థల మత చాంధసవాదాన్ని తిరస్కరించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలను కోరారు.
కాగా ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలో పెద్ద దుమారం చెలరేగింది. ట్రంప్ వ్యాఖ్యలని ఖండిస్తూ వివిధ రాష్ట్రాల గవర్నలు ఆయమపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. వైట్‌హౌస్ సైతం ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టింది.
అమెరికా విలువలకు, జాతీయ భద్రతా వైఖరికి ట్రంప్ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది. ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ తీవ్రంగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మతి తప్పినవిగానూ, రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు.
Donald Trump is unhinged. His "policy" proposals are not serious.
— Jeb Bush (@JebBush) December 7, 2015 











Click it and Unblock the Notifications