ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచ దిగ్గజాలు - వారే స్పెషల్ అట్రాక్షన్..!!

Trump's inauguration: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్దమైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రముఖులు వాషింగ్టన్ చేరుకుంటున్నారు. పలు రంగాలకు చెందిన దిగ్గజాలు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. వ్యాపార వేత్తలు..టెక్ దిగ్గజాలతో సహా పలు దేశాల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. భారత్ నుంచి ప్రధాని మోదీ ప్రతినిధిగా కేంద్ర మంత్రి జైశంకర్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. దీంతో, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ ప్రమాణ స్వీకారం వైపు ఆసక్తిగా చూస్తోంది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ అందరి చూపు అమెరికా వైపే ఉంది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ముగ్గురు టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పాల్గొంటున్నారు. ఇక, పలు దేశాల అధినేత లు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి తరలి వస్తున్నారు. వారిలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భవిష్యత్ దౌత్య సంబంధాల దిశగా చైనా అధ్యక్షుడు హాజరు కీలకంగా మారుతోంది.

Donald Trump will be hosting several world leaders at his inauguration ceremony here the list

ట్రంప్ తొలి పదవీకాలంలో జిన్‌పింగ్ ఆయనకు ప్రత్యర్థి. ఇప్పుడు ఆయన హాజరు పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇప్పటికే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెండు రోజుల ముందు, రాజధాని వాషింగ్టన్ డీసీలో సందడి మొదలైంది. ఆనవాయితీ ప్రకారం ఓడిపోయిన అభ్యర్ధులు ప్రమాణ స్వీకారం వేళ హాజరవుతున్నారు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రంప్ వేడుకకు హాజరయ్యే వ్యక్తుల జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, మిత్రులు తరలి రానున్నారు. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

ట్రంప్‌ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ చేరుకున్నారు. అక్కడ 100 మంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. వారిలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు. ప్రమాణం చేశాక ట్రంప్‌ ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు. అమెరికా ఐక్యతే థీమ్‌గా తన ఉపన్యాసం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్‌లో జరిగే విందులో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+