డొనాల్డ్ ట్రంప్ డైవర్షన్ పాలిటిక్స్- కటకటాల వెనక్కి బరాక్ ఒబామా?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..సంచలనాలకు తెర తీశారా?, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోన్నారా?, పాత కేసులను తిరగదోడుతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. దీనిపై తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో.. ఇలాంటి ప్రశ్నలకు తెర తీసినట్టయింది.
2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా మోసానికి పాల్పడ్డారని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు వెలువడిన అతి కొద్ది రోజుల్లోనే ఒబామా అరెస్ట్ అయినట్లు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియో ఇది.

తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఒబామాను ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇంటెలిజెన్స్ (FBI) అధికారులు వైట్ హౌస్ లో అరెస్టు చేసినట్లు చూపించారు.. ఈ వీడియోలో. డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోకు ఎవరూ చట్టానికి అతీతులు కాదు.. అనే క్యాప్షన్ జత చేశారు.
వీడియో ప్రారంభంలో ఒబామా మాట్లాడటం కనిపించింది. ఎవరు కూడా.. ప్రత్యేకించి దేశాధ్యక్షుడు చట్టానికి అతీతుడు కాదు.. అని బరాక్ ఒబామా చెప్పడం కనిపించింది. ఆ తర్వాత మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలువురు డెమోక్రటిక్ నేతలు అదే పదాన్ని ప్రస్తావించడం ఇందులో చూడొచ్చు.
పెపే ది ఫ్రాగ్ మీమ్ కు సంబంధించిన ఓ వికృత రూపాన్ని డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించారు. డెమోక్రట్ల ప్రకటనలను ట్రంప్ ఎగతాళి చేసినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఒబామాను ఎఫ్బీఐ అధికారులు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో బేడీలు వేసి అరెస్టు చేస్తుండగా ట్రంప్ చిరునవ్వుతో చూస్తూ కనిపించారిందులో. ఆ తర్వాత ఒబామా జైలు దుస్తులు ధరించి కటకటాల వెనుక నిలబడి ఉంటాడు.
ఒబామా హయాంలో ఉన్నత అధికారులు 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఇటీవల ట్రంప్ జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఒబామా హయాంలోని సీనియర్ అధికారులు ట్రంప్ విజయం రష్యా జోక్యంతోనే సాధ్యమైందని చూపేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా ఆమె ప్రస్తావించారు. ఒబామాతో పాటు అప్పటి జాతీయ భద్రతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ట్రంప్ కూడా ఆమె వాదనతో ఏకీభవించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోన్నారు. మరికొందరు ఎప్ స్టైన్ ఫైల్స్ నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు.
-
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!












Click it and Unblock the Notifications