ట్రంప్ టాప్ స్పీడ్: చైనా బద్ధ విరోధికి విదేశాంగ శాఖ: కేబినెట్‌ ఫస్ట్ అపాయింట్‌మెంట్

Donald Trump's swearing-in ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడాయన. రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. 2017లోనూ ఆయన ఆ దేశాధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. 2016 నాటి ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ తిరుగులేని మెజారిటీతో అందలం ఎక్కారు.

Donald Trump s cabinet Marco Rubio to be the US Secretary of State

ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే కేపిటల్ హిల్స్‌ ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలను స్వీకరించారు. అడ్మినిస్ట్రేషన్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నాలకు దిగారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఎన్నికల సమయంలో, ఆ తరువాత ఇచ్చిన పలు ప్రసంగాల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన ఆర్డర్లు అవి.

అదే సమయంలో తన కేబినెట్ నియామకాలపైనా దృష్టి సారించారు ట్రంప్. విదేశాంగ శాఖకు మంత్రిని ఎంపిక చేశారు. ఈ శాఖ కార్యదర్శిగా మార్కొ రుబియో అపాయింట్ అయ్యారు. ఆయన మంత్రివర్గంలో ఇదే మొట్టమొదటి నియామకం. ఓ లాటినో.. అమెరికా మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం కూడా ఇదే తొలిసారి.

అమెరికాకు సంబంధించినంత వరకు అత్యంత కీలకం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ. అగ్రరాజ్యంగా, ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరిస్తోంది యూఎస్. దానికి అనుగుణంగా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. మిత్రత్వాన్ని మరింత బలపర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ శాఖను తన అనుంగు అనుచరుడు మార్కొ రుబియో చేతిలో పెట్టారు ట్రంప్. మార్కొ.. ఫ్లోరిడా సెనెటర్. 2011 జనవరి 3వ తేదీన తొలిసారిగా సెనెటర్‌గా ఎన్నికయ్యారు మార్కో. అప్పటి నుంచి ఎలెక్ట్ అవుతూనే వస్తోన్నారు. డొనాల్డ్ ట్రంప్ సొంత రాష్ట్రం కూడా ఫ్లోరిడానే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చైనాకు బద్ధ విరోధి మార్కో. ఆయనను తమ దేశంలో అడుగుపెట్టడాన్ని 2020లోనే నిషేధించిందా డ్రాగన్ కంట్రీ. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెనెట్ కమిటీ సభ్యుడిగా ఉంటోన్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా మార్కో నియామకాన్ని కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్కోతో సహా మొత్తం 99 మంది సెనెటర్లు అనుకూలంగా ఓటు వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+