ఆస్ట్రేలియాను వణికించిన భూకంపం.. 28సార్లు ప్రకంపనలు నమోదు..
పెర్త్ : ఆస్ట్రేలియాను వరుస భూప్రకంపనలు వణికిస్తున్నాయి. ఆదివారం 6.6 తీవ్రతతో భూకంపం రాగా.. సోమవారం ఉదయం సైతం భూమి కంపిచింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.5 గా నమోదైంది. ఈ భూకంపం అనంతరం 28సార్లు ప్రకంపనలు నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే ప్రకటించింది.
హిందూ మహాసముద్రానికి దగ్గరలో పది కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం లేదని సైంటిస్టులు చెప్పారు. ఆదివారం ఆస్ట్రేలియాలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ భూకంపం అనంతరం స్వల్ప ప్రకంపనలు నమోదవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రకంపనలను జనం గుర్తించలేరని చెప్పారు.













Click it and Unblock the Notifications