నడిరోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్...వీడియో వైరల్..!
వాషింగ్టన్ : ఈ మధ్యకాలంలో విమానాల్లో సాంకేతిక సమస్యలు తరుచుగా బయటపడుతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు పైలట్లు. తాజాగా ఓ సింగిల్ ప్రొపెల్లర్ కేఆర్2 విమానంలో ఇంధనం అయిపోవడంతో నిత్యం బిజీగా ఉండే రోడ్డుపై ల్యాండ్ అయ్యింది. అయితే సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్‌టన్‌లో చోటుచేసుకుంది. ఇక విమానం ల్యాండ్ అవుతుండగా వెనకాల వస్తున్న కారులో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వీడియో వైరల్ అయ్యింది.

ట్విటర్‌లో వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన జోనా బాటిస్త్ పోస్టు చేశాడు. తను ప్యాట్రోలింగ్‌లో ఉన్న సమయంలో విమానం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ల్యాండ్ అయిందని తెలిపాడు. మరోవైపు పైలట్లు ఎదుర్కొంటున్న కాంప్లికేషన్స్ పై డబ్ల్యూఎస్‌పీకి కూడా ముందస్తు సమచారం లేదు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందని చెప్పిన జోనా... ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఇక విమానం ల్యాండ్ అవగానే అందులోనుంచి పైలట్ కిందకు దూకి దాన్ని రోడ్డు పక్కకు లాక్కెల్లే ప్రయత్నం చేశారు.
Trooper Thompson’s dash cam video capturing this morning’s events! Great job by the pilot and trooper! pic.twitter.com/7X0uWYJ9fc
— Trooper Johnna Batiste (@wspd1pio) August 1, 2019
ఇక కారులో వేగంగా వస్తున్న థామ్సన్... విమానం నడిరోడ్డుపై ల్యాండ్ అవుతుండటం చూసి వెంటనే యూటర్న్ తీసుకుని తన కారు లైట్లను వెలిగించారు. వెనకాల ట్రాఫిక్‌ను నియంత్రించాడు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యాక వాహనాలను పంపించారు. మొత్తానికి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications