చావు ముందుకెళ్లి తిరిగొచ్చేశాడు(వీడియో)
సిడ్నీ: ఓ వ్యక్తి చావు దగ్గరకు వెళ్లి తిరిగొచ్చేశాడు. ఎలాగంటే.. రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్‌ఫాంపై నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కి వెళ్లాలనుకున్నాడు. వంతెన మెట్లపై వెళ్లడం బదులు పట్టాలు దాటటమే సులభమనుకున్నాడు.
నిలుచున్న ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలు వెళ్లే వరకూ వేచి చూసి పట్టాలు దాటడానికి దిగాడు. అంతే ఒక లైన్ ట్రాక్ దాటాడో లేదో మరో రైలు దూసుకొచ్చింది. వెంటనే తేరుకున్న అతడు.. ఎంత వేగంతో వెళ్లాడో అంతే వేగంతో వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు.

దీంతో అతను సెకన్ల వ్యవధిలోనే తన చావును తప్పించుకున్నట్లయింది. ఈ భయానక ఘటన విక్టోరియాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications